వన్నెతగ్గని కుస్తీ పోటీలు

Wrestling Games In Rangareddy - Sakshi

అత్తాపూర్‌: మూడురోజుల పాటు కొనసాగిన సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కేసరి కుస్తీ పోటీలు శనివారం అర్ధరాత్రి ముగిశాయి. అత్తాపూర్‌ రాంబాగ్‌లో నిర్వహించిన ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.జనార్దన్‌రెడ్డి, కార్పొరేటర్‌ రావుల విజయజంగయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టైటిల్‌ను కేవల్‌యాదవ్‌ గెలుచుకోగా రన్నర్‌గా వెంకటేష్‌ నిలిచారు. మహిళా విభాగంలో రోహిణి సత్యశివయాదవ్‌ టైటిల్‌..రన్నర్‌గా కార ణ్య నిలిచారు. బాలకేసరి టైటిల్‌ను అక్షిత్‌కుమా ర్‌ గెలుపొందారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ మాట్లాడుతూ.. ప్రాచీన క్రీడల్లో కుస్తీ పోటీలకు ఎంతో చరిత్ర ఉందన్నారు.

నేడు క్రీడారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చినా కుస్తీ పోటీలకు ఏమాత్రం వన్నె తగ్గలేదన్నారు. నాటినుంచి నేటి వరకు పోటీ సరళి ఒకేలా ఉందన్నారు. శారీర ధృడత్వానికి కుస్తీ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయని చెప్పారు. నేటి యువత తమ విలువైన సమయాన్ని కంప్యూటర్లతో వృథా చేసుకోవద్దని సూచిం చారు. పోటీ ప్రపంచంలో విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని ఆయన అభిప్రా యపడ్డారు. పోటీల ద్వారానే మెరుగైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై.శ్రీధర్, మల్లారెడ్డి, కొమురయ్య, శ్రీనివాస్‌యాదవ్, అభిమన్యు, వనం శ్రీరామ్‌రెడ్డి, వెంకటేష్, వాసు, బాలుగౌడ్, శ్రీకాంత్, విజయ్‌కుమార్, జగన్, కిరణ్‌చారీ, సిద్దేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top