భారత్‌పై కన్నెత్తి చూస్తే ఇంట్లోకి చొరబడి దాడి చేస్తాం: ప్రధాని మోదీ | PM Modi Leads Sardar Vallabhbhai Patel 150th Jayanti Celebrations at Statue of Unity | Sakshi
Sakshi News home page

భారత్‌పై కన్నెత్తి చూస్తే ఇంట్లోకి చొరబడి దాడి చేస్తాం: ప్రధాని మోదీ

Oct 31 2025 8:59 AM | Updated on Oct 31 2025 12:06 PM

PM pays homage to Sardar Patel on 150th birth anniversary

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా  రాష్ట్రీయ ఏక్తా దివాస్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్‌ కెవాడియాలోని  స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద  ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగాయి. పటేల్‌ భారీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం. పరేడ్‌ను ప్రారంబించి జాతీయ ఏకతా ప్రతిజ్ఞను చేయించారాయన. అంతకు ముందు..  

తన ఎక్స్‌ ఖాతాలో ఆయన ఒక పోస్ట్‌ ఉంచారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశం నివాళులు అర్పిస్తోంది. ఆయన భారత ఏకతకు ప్రేరణగా నిలిచారు. ఆయన చూపిన మార్గంలో దేశాన్ని బలంగా, స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దే సంకల్పాన్ని మళ్లీ గుర్తుచేసుకుంటున్నాం అని సందేశం ఉంచారు. 

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద జరిగిన పరేడ్‌లో వివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు. ఫ్లాగ్ మార్చ్, CAPF, పోలీస్, NCC, బ్యాండ్ బృందాలు, గుర్రాలు, ఒంటెలు, శునకాలతో కూడిన మౌంటెడ్ యూనిట్లు ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. మహిళా బలగాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చివరగా ఎయిర్ షో నిర్వహించింది. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతం నేపథ్యంలో ఈ పరేడ్‌ను నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

మోదీ మాట్లాడుతూ..  . దేశ సమగ్రత, ఐక్యత  మనందరికీ చాలా ముఖ్యమైనది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. కానీ మా ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేరుస్తోంది. కశ్మీర్ సమస్యను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. ఆర్టికల్ 370 ని తొలగించి కశ్మీర్ ను భారత్ అభివృద్ధిలో భాగం చేశాం. భారత్ సరిహద్దులలో జనాభాను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై చర్యలు తీసుకోకుండా కళ్ళు మూసుకుంది. తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అంతర్గత భద్రతను గాలికి వదిలేసింది. భారత్ పై కన్నెత్తి చూస్తే ఇంట్లోకి చొరబడి దాడి చేస్తాం. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్ సహా ఉగ్రవాదులందరికీ భారత్ సత్తా తెలిసి వచ్చింది. అర్బన్ నక్సలైట్లు, వారికి మద్దతు ఇచ్చే వారిని వదిలిపెట్టం . భారత్ అంతర్గత భద్రతకు నక్సలైట్లు ముప్పుగా మారారు. దేశానికి ముప్పు ఏర్పడితే  ప్రతి ఒక్కరికి భద్రత ప్రమాదంలో పడుతుంది’’ అని అన్నారు. 

 

 

 ఇదిలా ఉంటే.. పటేల్‌ జయంతి వేళ ప్రధాని మోదీ ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. గురువారం ఏకతా నగర్‌లోని పటేల్‌ మనవడు గౌతమ్ పటేల్, ఆయన భార్య నందిత, కుమారుడు కేదార్, కోడలు రీనా, మనవరాలు కరీనాతో కాసేపు ముచ్చటించారు. పటేల్ కుటుంబాన్ని కలవడం ఆనందంగా ఉంది. ఆయన దేశానికి చేసిన అపార సేవలను గుర్తుచేసుకున్నాం అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement