breaking news
Ekta Diwas
-
భారత్‌పై కన్నెత్తి చూస్తే ఇంట్లోకి చొరబడి దాడి చేస్తాం: ప్రధాని మోదీ
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్ కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగాయి. పటేల్ భారీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం. పరేడ్‌ను ప్రారంబించి జాతీయ ఏకతా ప్రతిజ్ఞను చేయించారాయన. అంతకు ముందు.. తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక పోస్ట్ ఉంచారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశం నివాళులు అర్పిస్తోంది. ఆయన భారత ఏకతకు ప్రేరణగా నిలిచారు. ఆయన చూపిన మార్గంలో దేశాన్ని బలంగా, స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దే సంకల్పాన్ని మళ్లీ గుర్తుచేసుకుంటున్నాం అని సందేశం ఉంచారు. India pays homage to Sardar Vallabhbhai Patel on his 150th Jayanti. He was the driving force behind India’s integration, thus shaping our nation’s destiny in its formative years. His unwavering commitment to national integrity, good governance and public service continues to… pic.twitter.com/7quK4qiHdN— Narendra Modi (@narendramodi) October 31, 2025స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద జరిగిన పరేడ్‌లో వివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు. ఫ్లాగ్ మార్చ్, CAPF, పోలీస్, NCC, బ్యాండ్ బృందాలు, గుర్రాలు, ఒంటెలు, శునకాలతో కూడిన మౌంటెడ్ యూనిట్లు ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. మహిళా బలగాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చివరగా ఎయిర్ షో నిర్వహించింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతం నేపథ్యంలో ఈ పరేడ్‌ను నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.మోదీ మాట్లాడుతూ.. . దేశ సమగ్రత, ఐక్యత మనందరికీ చాలా ముఖ్యమైనది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. కానీ మా ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేరుస్తోంది. కశ్మీర్ సమస్యను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. ఆర్టికల్ 370 ని తొలగించి కశ్మీర్ ను భారత్ అభివృద్ధిలో భాగం చేశాం. భారత్ సరిహద్దులలో జనాభాను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై చర్యలు తీసుకోకుండా కళ్ళు మూసుకుంది. తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అంతర్గత భద్రతను గాలికి వదిలేసింది. భారత్ పై కన్నెత్తి చూస్తే ఇంట్లోకి చొరబడి దాడి చేస్తాం. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్ సహా ఉగ్రవాదులందరికీ భారత్ సత్తా తెలిసి వచ్చింది. అర్బన్ నక్సలైట్లు, వారికి మద్దతు ఇచ్చే వారిని వదిలిపెట్టం . భారత్ అంతర్గత భద్రతకు నక్సలైట్లు ముప్పుగా మారారు. దేశానికి ముప్పు ఏర్పడితే ప్రతి ఒక్కరికి భద్రత ప్రమాదంలో పడుతుంది’’ అని అన్నారు. ਸਰਦਾਰ ਵੱਲਭ ਭਾਈ ਪਟੇਲ ਦੀ 150ਵੀਂ ਜਯੰਤੀਕੌਮੀ ਏਕਤਾ ਦਿਵਸ ਵਜੋਂ ਮਨਾਇਆ ਜਾ ਰਿਹਾ ਦਿਨStatue of Unity ‘ਤੇ PM Modi ਨੇ ਦਿੱਤੀ ਸ਼ਰਧਾਂਜਲੀ#SardarVallabhbhaiPatel #jayanti #pmmodi #statueofunity #DailypostTV pic.twitter.com/znGkQRbK4f— DailyPost TV (@DailyPostPhh) October 31, 2025 Met the family of Sardar Vallabhbhai Patel in Kevadia. It was a delight to interact with them and recall the monumental contribution of Sardar Patel to our nation. pic.twitter.com/uu1mXsl3fI— Narendra Modi (@narendramodi) October 30, 2025 ఇదిలా ఉంటే.. పటేల్ జయంతి వేళ ప్రధాని మోదీ ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. గురువారం ఏకతా నగర్‌లోని పటేల్ మనవడు గౌతమ్ పటేల్, ఆయన భార్య నందిత, కుమారుడు కేదార్, కోడలు రీనా, మనవరాలు కరీనాతో కాసేపు ముచ్చటించారు. పటేల్ కుటుంబాన్ని కలవడం ఆనందంగా ఉంది. ఆయన దేశానికి చేసిన అపార సేవలను గుర్తుచేసుకున్నాం అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. -
అక్టోబర్ 31.. రాష్ట్రీయ ఏక్తా దివస్
పట్నా: ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ సమైక్యతా దినోత్సవం) నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఏటా రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో పరేడ్ నిర్వహించినట్టుగానే రాష్ట్రీయ ఏక్తా దివస్ రోజున గుజరాత్‌లోని ఏక్తా నగర్లో భారీ పరేడ్ నిర్వహిస్తామని తెలిపారు. సర్దార్ వల్లబ్భాయి పటేల్ 150 జయంతి (అక్టోబర్ 31)ని పురస్కరించుకొని నవంబర్ 1 నుంచి భారత్ పర్వ్–2025 ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఈ పరేడ్ జాతీయ సమైక్యతను ప్రతిబింబిస్తుంది. సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రారంభిస్తున్న ఈ పరేడ్ ఏటా అక్టోబర్ 31న ఘనంగా జరుగుతుంది. ఈ పరేడ్ సర్దార్ పటేల్ సిద్ధాంతాలు, ఆయన సేవలను నేటి తరానికి తెలియజేసేలా ఉంటుంది. శుక్రవారం నిర్వహించే పరేడ్‌లో మహి ళా కంటింజెంట్, సాంస్కృతిక ప్రదర్శనలు, పారా మిలిటరీ పరేడ్ల వంటివి ఉంటాయి’అని షా వెల్లడించారు. 15 రోజులు భారత్ పర్వ్ సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత్ పర్వ్–2025 ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. ఈ ఉత్సవాలు నవంబర్ 1న ప్రారంభమై ప్రముఖ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా జయంతి రోజైన నవంబర్ 15 వరకు గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (పటేల్ భారీ విగ్రహం) వద్ద నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్కడే పటేల్ 150వ జయంతి వేడుకలను కూడా శుక్రవారం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారని వెల్లడించారు. -
ఏక్తా దివస్ వేడుకల్లో ప్రధాని మోదీ
-
వన్ నేషన్ వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
అహ్మాదాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా.. జాతీయ ఐక్యతా దినోత్సవంతోపాటు దీపావళి పండుగ కూడా జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి చాలా ప్రత్యేకమైనదని అన్నారు. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ ప్రసంగించారు.‘‘దీపావళి పండగ.. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానం చేయడం ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం వైట్‌హౌస్‌లో 600 మందికి పైగా ప్రముఖ భారతీయ అమెరికన్లతో దీపావళిని జరుపుకున్నారు. అనేక దేశాల్లో దీపావళి జాతీయ పండుగగా జరుపుకుంటున్నారు. ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’’ త్వరలో సాకారమవుతుంది. దేశంలోని అన్ని ఎన్నికలను ఒకే రోజు లేదా నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్వహించటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు త్వరలో లైన్ క్లియర్ అవుతుంది. ఈ ప్రతిపాదనకు ఈ ఏడాది ప్రారంభంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదన సమర్పించనున్నాం.#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says "...We are now working towards One Nation One Election, which will strengthen India's democracy, give optimum outcome of India's resources and the country will gain new momentum in achieving the dream of a… pic.twitter.com/vUku6ZCnVv— ANI (@ANI) October 31, 2024 మేం ప్రస్తుతం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ దిశగా పని చేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. భారతదేశ వనరుల సరైన ఫలితాన్ని ఇస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాధించడంలో సాయపడుతుంది. భారతదేశం.. నేషన్ వన్ సివిల్ కోడ్, సెక్యులర్ సివిల్ కోడ్ కలిగి దేవంగా అవతరించనుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేశాం. దానిని శాశ్వతంగా పాతిపెట్టాం. రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేవారే ఎక్కువగా అవమానిస్తున్నారు’’ అని అన్నారు. -
సవాళ్లను ఎదుర్కొనే సత్తా భారత్ సొంతం
కేవాడియా/న్యూఢిల్లీ: అన్ని రకాల అంతర్గత, బహిర్గత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విషయంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ నుంచి దేశం స్ఫూర్తిని పొందుతోందని అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ సందర్భంగా మోదీ ఆదివారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేస్తే మన దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చవచ్చని పిలుపునిచ్చారు. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ కోసం వల్లబ్‌భాయ్ పటేల్ అలుపెరుగని పోరాటం సాగించారని కొనియాడారు. ఆయన కేవలం చరిత్రలో కాదు, ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని చెప్పారు. పౌరులుగా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించడమే పటేల్‌కు నివాళి అని సూచించారు. సమగ్రతను దెబ్బతీయలేరు: అమిత్ షా సర్దార్‌పటేల్ రాబోయే తరాలకు సైతం స్ఫూర్తినిస్తూనే ఉంటారని హోం మంత్రి అమిత్ షా అన్నారు. భారత్ భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండబోతోందని, ఐక్యత, సమగ్రతను దెబ్బతీయడం ఎవరి తరమూ కాదని తేల్చిచెప్పారు. పటేల్ జయంతి సందర్భంగా ఆదివారం గుజరాత్‌లోని కేవాడియాలో ఐక్యతా శిల్పం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. పటేల్ కృషి వల్లే భారత్ ఐక్యంగా నిలిచిందని అన్నారు. అయినప్పటికీ ఆయనకు తగిన గౌరవ మర్యాదలు లభించలేదని ఆక్షేపించారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పటేల్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని, ఆయనకు నివాళిగా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పిందని అమిత్ షా తెలిపారు. దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ పటేల్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం నివాళులర్పించారు. ప్రజాస్యామ్యాన్ని రక్షించడమే పటేల్‌కు నిజమైన నివాళి అవుతుందన్నారు. -
'ఆయన తొలి ప్రధాని అయ్యుంటే బాగుండేది'
న్యూఢిల్లీ : సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశ తొలి ప్రధాని అయి ఉంటే బాగుండని దేశ ప్రజలు భావిస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. సర్దార్ పటేల్ 141వ జయంతి సందర్భంగా తన శాఖ అధికారులు, సిబ్బందితో వెంకయ్య సోమవారం రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశ నిర్మాణంలో వల్లభాయ్ పటేల్ వంటి నేతలు చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సి ఉందన్నారు. దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న గొప్ప నాయకులైన పటేల్, సుభాష్ చంద్రబోస్, బీఆర్ అంబేద్కర్, పండిత్ ధ్యాన్ దయాళ్ ఉపాధ్యాయ తదితరులకు జీవించి ఉన్నకాలంలో సముచిత గౌరవం దక్కలేదన్నారు. వారి కృషిని, ఔచిత్యాన్ని దేశ ప్రజలు స్మరించుకోవాల్సి ఉందన్నారు. పటేల్ ఒక్కడే ప్రయత్నం చేసి దేశాన్ని ఏకతాటిపై నిలబెట్టి, అన్ని సంస్థానాలను భారత దేశంలో విలీనం చేసి దేశ ఐకమత్యాన్ని నిలబెట్టిన మహానాయకుడని వెంకయ్య ప్రశంసించారు. స్వతంత్రం అనంతరం ఆయన మూడేళ్లే జీవించి ఉన్నారని, ఎక్కువ కాలం ఉండి ఉంటే దేశం ఈ రోజు ఎదుర్కొంటున్న సవాళ్లు ఉత్పన్నమయ్యేవి కావని అభిప్రాయపడ్డారు. దేశ ముఖచిత్రమే మరోరకంగా ఉండేదని, పటేల్ దేశ తొలి ప్రధాని అయి ఉంటే బాగుండేదని అన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనించడమే ఆయనకు అర్పించే నివాళి అని, ఆశ్రిత పక్ష పాతానికి, వారసత్వ రాజకీయాలకు చోటివ్వకుండా వ్యవహరించారన్నారు. అనంతరం వెంకయ్య..ఉద్యోగులతో అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. -
పటేల్ జయంతి సందర్భంగా ఐక్యతా దివస్


