అన్నదాత ఆగ్రహం | Wrath to former | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆగ్రహం

Jun 7 2014 2:16 AM | Updated on Aug 15 2018 9:20 PM

అన్నదాత ఆగ్రహం - Sakshi

అన్నదాత ఆగ్రహం

ొత్త ప్రభుత్వానికి రుణమాఫీ ఉచ్చు బిగుసుకుంది. అధికారంలోకొచ్చి వారం గడవక ముందే.. రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం జిల్లా రైతులను ఆగ్రహానికి గురి చేసింది. గ

రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతన్న
ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లిన జిల్లా
గుండెపోటుతో రైతు మృతి
ఎమ్మెల్యే ‘వొడితెల’ ఘెరావ్
కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం

 
 ొత్త ప్రభుత్వానికి రుణమాఫీ ఉచ్చు బిగుసుకుంది. అధికారంలోకొచ్చి వారం గడవక ముందే.. రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం జిల్లా రైతులను ఆగ్రహానికి గురి చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రైతులు తీసుకున్న లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేయాలన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయంపై జిల్లా రైతులు భగ్గుమన్నారు. షరతులు లేని రుణ మాఫీ పథకాన్ని వర్తింపజేయాల్సిందేనంటూ రోడ్డెక్కారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కాలపరిమితితో సంబంధం లేకుండా.. రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలకు విపక్షాలు బాసటగా నిలిచాయి. ధర్నా, రాస్తారోకోలు, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనాలతో జిల్లా దద్దరిల్లింది.

 ఆగిన గుండె

బెజ్జంకి మండలం మాదాపూర్‌కు చెందిన నూనె స్వామిరెడ్డికి ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. పంట కోసం మూడేళ్ల క్రితం ఇండియన్ బ్యాంకు నుంచి రూ.70 వేల పంట రుణం తీసుకున్నాడు. పెట్టుబడి కోసం రూ.4 లక్షలు అప్పు చేశాడు. ప్రకృతి వైపరీత్యాలతో రెండు మూడేళ్లుగా పంటనష్టం వాటిల్లింది. చేసిన అప్పు తీర్చలేకపోయాడు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే కనీసం బ్యాంకు రుణమైనా మాఫీ అవుతుందని భావించాడు. కానీ, గత ఆర్థిక సంవత్సరం తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుందని తెలియడంతో ఆందోళన చెందాడు. శుక్రవారం ఇంట్లో భార్య భారతవ్వతో ఇదే విషయమై చర్చిస్తూ కుప్పకూలి మరణించాడు.

ఆందోళనలు

ఆంక్షలు లేని రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలంటూ.. హుస్నాబాద్‌లో బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కవ్వ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ వాహనాన్ని అడ్డుకుని.. ఘెరావ్ చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలు, కథలాపూర్ మండలం చింతకుంటలో, గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లిలో రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మకు నిప్పంటించారు. మెట్‌పల్లి, మల్లాపూర్, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలం గూడెం తదితర గ్రామాల్లో రాస్తారోకోలకు దిగారు.

మాటిచ్చి  మోసం చేస్తారా?

మేనిఫెస్టోలో.. రైతులందరూ తీసుకున్న లక్ష రూపాయలలోపు రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి రాగానే విస్మరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలకు ముందు రైతులకు రూ.లక్ష రుణమాఫీ కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు బ్యాంకర్లు చెబితే ఇస్తామనడం సరైంది కాదని టీపీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్ కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. మరోపక్క.. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే కేసీఆర్ ప్రజలకు హామీలు ఇచ్చారని ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ విమర్శించారు. జిల్లాలో పలువురు నాయకులు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలంటూ డిమాండ్ చేశారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement