breaking news
swami reddy
-
తిరుపతిలో తెలుగుతమ్ముళ్ల దౌర్జన్యం
చిత్తూరు: అధికార పార్టీ అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో శుక్రవారం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి స్వామిరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. స్వామిరెడ్డిపై దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నావంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదుచేసినా.. నిందితులకే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని స్వామిరెడ్డి వాపోయారు. -
విద్యుత్ ఉద్యోగుల విభజనను త్వరగా చేపట్టాలి
నల్లగొండ :విద్యుత్ ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తిచేయాలని ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ, కార్యదర్శి స్వామిరెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ వసతి గృహంలో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం కూడా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత ఇంజినీర్లను వీలైనంత త్వరగా వారి ప్రాంతాలకు పంపాలన్నారు. అదే విధంగా బంగారు తెలంగాణ సాధన దిశగా విద్యుత్ ఇంజినీర్ల సంఘం నిరంతం కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కే వీఎన్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత ఆగ్రహం
రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతన్న ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లిన జిల్లా గుండెపోటుతో రైతు మృతి ఎమ్మెల్యే ‘వొడితెల’ ఘెరావ్ కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం ొత్త ప్రభుత్వానికి రుణమాఫీ ఉచ్చు బిగుసుకుంది. అధికారంలోకొచ్చి వారం గడవక ముందే.. రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం జిల్లా రైతులను ఆగ్రహానికి గురి చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రైతులు తీసుకున్న లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేయాలన్న టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయంపై జిల్లా రైతులు భగ్గుమన్నారు. షరతులు లేని రుణ మాఫీ పథకాన్ని వర్తింపజేయాల్సిందేనంటూ రోడ్డెక్కారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కాలపరిమితితో సంబంధం లేకుండా.. రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలకు విపక్షాలు బాసటగా నిలిచాయి. ధర్నా, రాస్తారోకోలు, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనాలతో జిల్లా దద్దరిల్లింది. ఆగిన గుండె బెజ్జంకి మండలం మాదాపూర్‌కు చెందిన నూనె స్వామిరెడ్డికి ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. పంట కోసం మూడేళ్ల క్రితం ఇండియన్ బ్యాంకు నుంచి రూ.70 వేల పంట రుణం తీసుకున్నాడు. పెట్టుబడి కోసం రూ.4 లక్షలు అప్పు చేశాడు. ప్రకృతి వైపరీత్యాలతో రెండు మూడేళ్లుగా పంటనష్టం వాటిల్లింది. చేసిన అప్పు తీర్చలేకపోయాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కనీసం బ్యాంకు రుణమైనా మాఫీ అవుతుందని భావించాడు. కానీ, గత ఆర్థిక సంవత్సరం తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుందని తెలియడంతో ఆందోళన చెందాడు. శుక్రవారం ఇంట్లో భార్య భారతవ్వతో ఇదే విషయమై చర్చిస్తూ కుప్పకూలి మరణించాడు. ఆందోళనలు ఆంక్షలు లేని రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలంటూ.. హుస్నాబాద్‌లో బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కవ్వ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ వాహనాన్ని అడ్డుకుని.. ఘెరావ్ చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలు, కథలాపూర్ మండలం చింతకుంటలో, గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లిలో రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మకు నిప్పంటించారు. మెట్పల్లి, మల్లాపూర్, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలం గూడెం తదితర గ్రామాల్లో రాస్తారోకోలకు దిగారు. మాటిచ్చి మోసం చేస్తారా? మేనిఫెస్టోలో.. రైతులందరూ తీసుకున్న లక్ష రూపాయలలోపు రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి రాగానే విస్మరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలకు ముందు రైతులకు రూ.లక్ష రుణమాఫీ కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు బ్యాంకర్లు చెబితే ఇస్తామనడం సరైంది కాదని టీపీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్ కరీంనగర్లో విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. మరోపక్క.. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే కేసీఆర్ ప్రజలకు హామీలు ఇచ్చారని ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ విమర్శించారు. జిల్లాలో పలువురు నాయకులు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలంటూ డిమాండ్ చేశారు.