ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం

Worlds Largest Meditation Center Is Set To Open On 28/01/2020 - Sakshi

ఈ నెల 28న హైదరాబాద్‌లో ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌ : ఏక కాలంలో లక్ష మంది ధ్యానం చేసేలా ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’అనే సంస్థ అత్యాధునిక వసతులతో హైదరాబాద్‌ శివార్లలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం 28న ప్రారంభం కానున్నది. సంస్థ అంతర్జాతీయ మార్గదర్శకులు దాజీ ఈ కేంద్రాన్ని సంస్థ మొదటి మార్గదర్శి లాలాజీ పేరిట అంకితం చేస్తారు. 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ధ్యాన కేంద్రంలో సెంట్రల్‌ హాల్, మరో 8 అనుబంధ హాళ్లు ఉన్నాయి. ఈ నిర్మాణం రాత్రి వేళల్లో విద్యుద్దీపాల వెలుగులో సిడ్నీ హార్బర్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడాలతో పోటీ పడుతుందని నిర్వాహకులు చెప్తున్నారు.

‘హార్ట్‌ఫుల్‌నెస్‌’75వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 28 నుంచి 30, ఫిబ్రవరి 2 నుంచి 4, ఫిబ్రవరి 7నుంచి 9వ తేదీ నడుమ జరిగే సమావేశాల్లో 1.2లక్షల మంది ధ్యానంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, 7న అన్నా హజారే ధ్యాన సాధకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జనవరి 29న జరిగే కార్యక్రమంలో బాబా రాందేవ్‌ పాల్గొంటారు. 1400 ఎకరాల్లో విస్తరించిన ఈ ధ్యాన కేంద్రం 40వేలకు మందికి పైగా వసతి కల్పించడంతో పాటు, రోజుకు లక్ష మందికి వండి వార్చేలా వంట గది నిర్మించినట్లు సంస్థ మార్గదర్శి దాజీ వెల్లడించారు. 6 లక్షల మొక్కలతో నర్సరీ ఏర్పాటు చేశారు. త్వరలో 350 పడకల ఆయుష్‌ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top