కరీంనగర్ జిల్లాలోని కోనరావుపూట మండలంలోని మల్కపేటకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో గురువారం నిరసనకు దిగారు.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని కోనరావుపూట మండలంలోని మల్కపేటకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో గురువారం నిరసనకు దిగారు. కొంతకాలంగా తాగునీటి కోసం గ్రామంలో ఇబ్బంది పడుతుండటంతో మహిళలంతా కలిసి సర్పంచ్ ఇంటి ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. గ్రామ సర్పంచ్ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
(కోనరావుపేట)