బెల్ట్‌షాపును ధ్వంసం చేసిన మహిళలు | Women's destroyed the beltshop | Sakshi
Sakshi News home page

బెల్ట్‌షాపును ధ్వంసం చేసిన మహిళలు

Oct 14 2017 2:25 AM | Updated on Oct 14 2017 4:19 AM

Women's destroyed the beltshop

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లి శివారు హన్మాండ్లపల్లి గ్రామంలోని బెల్ట్‌షాప్‌ను మహిళలు శుక్రవారం ధ్వంసంచేశారు. తాము రోజంతా కష్టపడి కూలి చేసి సంపాదించిన సొమ్ముతో తమ భర్తలు తాగి వచ్చి.. తమనే కొడుతున్నారని పలువురు మహిళలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్‌ షాప్‌ నిర్వహిస్తున్న సంపంగి సుభద్ర, చొప్పరి సరోజలను మహిళలు హెచ్చరించారు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవటంతోనే మద్యం ధ్వంసం చేసినట్లు వివరించారు.

అనంతరం సుల్తానాబాద్‌ పోలీసులకు బెల్ట్‌షాపు రద్దు చేయాలని వినతిపత్రాన్ని అందించారు. బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వీవోఏ అధ్యక్షురాలు గరిగంటి సరోజ, కార్యదర్శి చొప్పరి లక్ష్మి, గంగ, బోయిని వినోద, గాదాసు సునీత, చిక్కుడు రాజేశ్వరి, రాజేందర్‌ తదితరులు కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement