వివాహిత ఆత్మహత్యాయత్నం | women suicide attempt in karimnagar district | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Jan 9 2016 2:14 PM | Updated on Sep 3 2017 3:23 PM

కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో స్వప్న(32) అనే వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

గోదావరిఖని: కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో స్వప్న(32) అనే వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అడ్డుకోబోయిన భర్త వెంకటేశ్‌కు కూడా మంటలు అంటుకోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం స్వప్న పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భర్త వెంకటేశ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో పలుమార్లు హెచ్చరించింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పురాకపోవడంతో  ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement