చెట్టును ఢీకొన్న కారు.. మహిళ మృతి | women killed in road accident at khammam district | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు.. మహిళ మృతి

Jun 15 2016 10:11 AM | Updated on Aug 30 2018 4:07 PM

ఖమ్మం జిల్లా దమ్మపేట మండల శివారులోని పార్కలగండి సమీపంలో ఓ కారు చెట్టును ఢీకొట్టింది.

దమ్మపేట : ఖమ్మం జిల్లా దమ్మపేట మండల శివారులోని పార్కలగండి సమీపంలో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాల్వంచ పట్టణానికి చెందిన వరికూటి విజయలక్ష్మి(43) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాల్వంచ నుంచి గుబ్బల మంగమ్మగుడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement