కడియాల కోసం కాళ్లు నరికారు | woman murder in Mahabubnagar district | Sakshi
Sakshi News home page

కడియాల కోసం కాళ్లు నరికారు

Jun 7 2014 4:51 AM | Updated on Oct 8 2018 4:59 PM

ఆభరణాల కోసం దుండగులు ఓ మహిళ గొంతుకోసి కాళ్లు నరికి అతి కిరాతకంగా హత్య చేశారు.

* మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళ దారుణ హత్య
* 70 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు

 
 దేవరకద్ర, న్యూస్‌లైన్: ఆభరణాల కోసం దుండగులు ఓ మహిళ గొంతుకోసి కాళ్లు నరికి అతి కిరాతకంగా హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న 70తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లిలో గురువారంరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పోలమ్మ (40) రాత్రి భోజనం చేసి ఇంటి ముందు మంచంపై పడుకుంది.

 

అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు ఆమె గొంతుకోసి హత్య చేయడమేగాక. మోకాళ్ల వరకు నరికి వెండి కడియాలు, చేతులకు ఉన్న వెండి గాజులను ఎత్తుకెళ్లారు. మహబూబ్‌నగర్ ఓఎస్‌డీ జె.చెన్నయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement