ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు | woman gives birth to quadruplets | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు

Dec 5 2015 6:54 PM | Updated on Sep 3 2017 1:33 PM

ప్రతి ఏడు లక్షలమందిలో ఒకరు ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చే అరుదైన ఘటన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : ప్రతి ఏడు లక్షలమందిలో ఒకరు ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చే అరుదైన ఘటన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా తునికి పట్టణానికి చెందిన జి.శేఖర్, నళిని భార్యాభర్తలు. శేఖర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాగా నళిని గృహిణి. నళిని గర్భం దాల్చినప్పటి నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయడంతోపాటు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

నెలలు నిండటంతో ఈ నెల 4వ తేదీన శుక్రవారం రాత్రి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సీనియర్ గైనకాలజిస్టులు భాగ్యలక్ష్మి, మాధవీలతలతో పాటు 15 మంది వైద్య బృందం నళినికి ఆపరేషన్ నిర్వహించి పురుడుపోశారు. పుట్టిన నలుగురు ఆడ శిశువులూ ఆరోగ్యంగా ఉండటంతోపాటు 1.2 కేజీల చొప్పున బరువున్నారు. తల్లి నళిని కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement