భర్త, రెండేళ్ల కూతురుతో కలిసి ఆనందంగా బంధువుల వివాహానికి వెళుతూ మార్గమాధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత దుర్మరణం చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
సదాశివపేట (మెదక్) : భర్త, రెండేళ్ల కూతురుతో కలిసి ఆనందంగా బంధువుల వివాహానికి వెళుతూ మార్గమాధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత దుర్మరణం చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మునిపల్లి మండలంలోని మేళసంగేం గ్రామం నుంచి సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామంలో బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఆదివారం గంగ(24) , భర్త అశోక్, రెండేళ్ల కూతురు అమ్ములుతో కలిసి స్కూటీపై బయలు దేరారు.
65వ నంబర్ జాతీయ రహదారిపై పట్టణంలోని హెచ్‌పీ గ్యాస్ ఏజేన్సీ ముందుకు రాగానే అతి వేగంతో వెనుక నుంచి వస్తున్న లారీ ముందు వెళ్తున్న స్కూటీనీ బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న గంగ రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది.