రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | Woman dies after being hit by car in nalgonda district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Sep 20 2015 6:59 PM | Updated on Aug 30 2018 3:56 PM

భువనగిరి మండలం రాయగిరి గ్రామశివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది.

నల్గొండ: భువనగిరి మండలం రాయగిరి గ్రామశివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో తలకు బలమైన గాయాలై ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. రోడ్డుపై ఆటోకోసం వేచి ఉన్న మహిళను కారులో వస్తున్న వ్యక్తి గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మృతిచెందిన మహిళ నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలానికి చెందిన మేకల సుజాత(28)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement