మహిళ మృతి..బంధువుల ఆందోళన | woman died, her relatives protests at hospital in medak | Sakshi
Sakshi News home page

మహిళ మృతి..బంధువుల ఆందోళన

Jun 25 2016 8:53 AM | Updated on Oct 16 2018 3:12 PM

వైద్యుల నిర్లక్ష్యం వల్లే వివాహిత మృతిచెందిందని ఆగ్రహించిన ఆమె బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు.

మెదక్: వైద్యుల నిర్లక్ష్యం వల్లే వివాహిత మృతిచెందిందని ఆగ్రహించిన ఆమె బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద శనివారం చోటుచేసుకుంది.

రామోజిపల్లి గ్రామానికి చెందిన సాయమ్మ(27) శుక్రవారం భర్తతో గొడవపడి ఎలకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను పెద్దశంకరంపేటలోని ఓ ప్రైవట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు సరైన చికిత్స అందించకపోవడంతో.. శనివారం తెల్లవారుజామున మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఆమె బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పిన వైద్యులు...ఆకస్మత్తుగా ఎలా చనిపోయిందని వారు ప్రశ్నిస్తున్నారు. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తూ.. ఆస్పత్రిలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆస్పత్రి యాజమాన్యం, మృతురాలి బంధువులతో మంతనాలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement