భూగర్భ గనుల్లో ఇక వైర్‌లెస్ ఫోన్లు | wireless phones to be in Underground mines | Sakshi
Sakshi News home page

భూగర్భ గనుల్లో ఇక వైర్‌లెస్ ఫోన్లు

Aug 26 2014 2:23 AM | Updated on Sep 2 2017 12:26 PM

సింగరేణి సంస్థ అధునాతన టెక్నాలజీతో కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

 కొత్తగూడెం: సింగరేణి సంస్థ అధునాతన టెక్నాలజీతో కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గతంలో భూగర్భ గనుల నుంచి బయటకు సమాచారం వచ్చేందుకు కేవలం వైర్‌లెస్ ఫోన్లనే వినియోగించేవారు. ఇవి కొన్ని ప్రాంతాలకే పరిమితంగా ఉండటం వల్ల గులాయిల్లో పనిచేసే కార్మికులు, యంత్రాల సమాచారం పైన ఉన్నవారికి తెలవడం జాప్యమయ్యేది.

భూగర్భ గనిలోని పని ప్రదేశాల్లో ఉన్నవారు తప్పిపోయిన సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. దీన్ని నివారించేందుకు భూగర్భగనిలో జీపీఆర్‌ఎస్ సిస్టమ్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. గనుల్లో వైర్‌లెస్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్లు సిద్ధం చేసింది. ఈ ఫోన్లను ప్రయోగాత్మకంగా అడ్రియాల్ ప్రాజెక్టులో ఏర్పాటు చేయనున్నారు. క్రమంగా మిగిలిన భూగర్భ గనుల్లో వైర్‌లెస్ ఫోన్లను అందుబాటులోకి తేనున్నారు. ఈ మేరకు అనుభవం కలిగిన వైర్‌లెస్ ఫోన్ల తయారీదారులు తమ సమాచారం అందించాలని సింగరేణి సంస్థ లేఖలు రాసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement