నదీ బోర్డుల వ్యయాన్ని భరించలేం! | Will not tolerate river boards Cost | Sakshi
Sakshi News home page

నదీ బోర్డుల వ్యయాన్ని భరించలేం!

Jun 11 2014 2:30 AM | Updated on Sep 2 2017 8:35 AM

నదీ బోర్డుల ఏర్పాటు ద్వారా అయ్యే అదనపు ఖర్చును భరించలేమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కేంద్రానికి స్పష్టం చేసినట్టు సమాచారం.

కేంద్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్పష్టీకరణ
 సాక్షి, హైదరాబాద్: నదీ బోర్డుల ఏర్పాటు ద్వారా అయ్యే అదనపు ఖర్చును భరించలేమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కేంద్రానికి స్పష్టం చేసినట్టు సమాచారం. రాష్ట్ర విభజన జరిగినందున రెండు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు రాకుండా చూసేందుకు గోదావరి, కృష్ణా నదులపై ప్రత్యేకమైన బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల వంటి విషయాలను ఈ బోర్డులే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రాజెక్టుల భద్రత కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని (సీఐఎస్‌ఎఫ్) ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రత కొనసాగనుంది. ఇందుకోసం ఏడాదికి రూ.300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.
 
ఇందులో భాగంగా ఇటీవల కేంద్రం నుంచి ఇక్కడకు వచ్చిన ప్రత్యేకాధికారులు ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. త్వరలోనే భద్రతా దళాలు ఇక్కడికి వస్తాయని, వారికి అవసరమైన వాహనాలు, వసతి వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. అయితే దీనిపై ఇరు రాష్ట్రాలు చర్చించుకుని ఈ వ్యయాన్ని భరించకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement