‘నా కొడుకును కొనుక్కుంటారా’ | will buy my son, a mother requests people | Sakshi
Sakshi News home page

‘నా కొడుకును కొనుక్కుంటారా’

Jun 16 2015 11:12 PM | Updated on Sep 2 2018 4:37 PM

‘నా కొడుకును కొనుక్కుంటారా’ - Sakshi

‘నా కొడుకును కొనుక్కుంటారా’

పోషించే స్థోమత లేదంటూ కొడుకును అమ్మకానికి పెట్టిన ఉదంతం మంగళవారం నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

ఇంటింటికీ తిరిగిన తల్లి
పోషించే స్థోమత లేదంటూ అమ్మకానికి..


ఇందూరు: పోషించే స్థోమత లేదంటూ కొడుకును అమ్మకానికి పెట్టిన ఉదంతం మంగళవారం నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ‘నా కొడుకును కొనుక్కుంటారా? అంటూ ఓ తల్లి ఇంటింటికి తిరిగి అడుగుతుండడంతో పోలీసులు బాలుడిని, అమ్మకానికి పెట్టిన తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌కు చెందిన నక్కల పద్మకు కొన్నేళ్ల క్రితం గంగారాంతో వివాహం జరిగింది. కొడుకు పుట్టిన తర్వాత గంగారాం మరణించడంతో పద్మ మరో పెళ్లి చేసుకుంది. కానీ, కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది.

వారం రోజుల క్రితం కొడుకు నక్కల దినేష్ (3)తో నిజామాబాద్‌కు రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఉంటోంది. మంగళవారం స్థానిక గౌతంనగర్ కాలనీకి వెళ్లిన ఆమె ‘నా బిడ్డను అమ్ముతాను కొంటారా’ అని స్థానికులను అడిగింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో అంబేద్కర్ కాలనీకి వెళ్లి ఇంటింటికి తిరిగి తన బిడ్డను రూ. 20 వేలకు అమ్ముతానని కాలనీవాసులకు చెప్పింది. దీంతో అక్కడి వారు మూడో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు వచ్చి ఆమెను, ఆమె వద్ద ఉన్న బిడ్డను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు శిశుగృహకు, తల్లిని స్వధార్ హోంకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement