జీవితాంతం టీఆర్‌ఎస్‌లోనే ఉంటా | Will be in Trs as life long | Sakshi
Sakshi News home page

జీవితాంతం టీఆర్‌ఎస్‌లోనే ఉంటా

Jul 30 2015 4:34 AM | Updated on Aug 15 2018 9:27 PM

బతికినంత కాలం టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని మాజీ డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ

గిట్టనివాళ్లే అసత్య ప్రచారం చేస్తున్నారు
ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య
 
 స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : బతికినంత కాలం టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని మాజీ డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. తాను టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు కొందరు గిట్టనివాళ్లు అసత్యప్రచారం చేస్తున్నారని తీవ్రపదజాలంతో ధ్వజమెత్తారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు ఇలాగే మొరుగుతాయని ఎద్దేవా చేశారు. మండలకేంద్రంలో బుధవారం సాయంత్రం నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యూరు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధనకు బతికినంత కాలం పనిచేస్తానని పునురుద్ఘాటించారు.

త్వరలో గ్రామ పంచాయతీలకు 14వ ఫైనాన్స్ నిధులు వస్తున్నాయని, రూ.25 కోట్లతో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాలని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరా రు. పార్టీ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్, పీఏసీఎస్ చైర్మన్ గట్టు రమేష్, పార్టీ మండలాధ్యక్షుడు అక్కినపెల్లి బాలరాజు, పట్టణ అధ్యక్షుడు బంగ్లా శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement