‘సమాచార’మేదీ? | where is the information? | Sakshi
Sakshi News home page

‘సమాచార’మేదీ?

Jul 15 2014 11:40 PM | Updated on Sep 2 2017 10:20 AM

‘సమాచార’మేదీ?

‘సమాచార’మేదీ?

ప్రభుత్వ విధి విధానాలను, ప్రణాళికల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి బహుముఖ మాధ్యమాల ద్వారా కృషి చేయాల్సిన జిల్లా సమాచార శాఖ సుప్తచేతనావస్థలో ఉంది. ప్రజల స్పందనను, అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంది.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వ విధి విధానాలను, ప్రణాళికల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి బహుముఖ మాధ్యమాల ద్వారా కృషి చేయాల్సిన జిల్లా సమాచార శాఖ సుప్తచేతనావస్థలో ఉంది. ప్రజల స్పందనను, అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంది.
 
 జిల్లా అధికారులకు, సమాచార శాఖ అధికారుల మధ్య సమన్వయం కొరవడటం ప్రజలకు శాపంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటే జిల్లా సమాచార శాఖ అధికారి పోస్టును అప్‌గ్రేడ్ చేశారు. ఏడీ స్థాయి అధికారికి బాధ్యత అప్పగించినా ప్రయోజనం లేకుండా పోయింది. జర్నలిస్టుల అక్రిడిటేషన్లు మ్యానిటరింగ్ చేయటం, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యక్రమాలకు బస్సులు పెట్టేందుకు మాత్రమే సమాచార శాఖ పనిచేస్తోందనే ప్రచారం ఉంది. ప్రభుత్వం ఇటీవల అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది.
 
 వాటికి సంబంధించిన సమాచారం ఏదీ ఆ శాఖ వద్ద లేకపోవడం గమనార్హం. వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారం, వాటిపై జరుగుతున్న సర్వేలు, క్షేత్రస్థాయిరివ్యూల వివరాలు కూడా ఆ శాఖ వద్ద లేవు. అయితేఉన్నతాధికారులు కూడా ఉద్దేశపూర్వకంగానే సమాచారశాఖను నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.దీనికి తోడు సమాచార శాఖ అధికారులు కూడా విషయాలన్నీ తెపిోవాలనే ఆసక్తి కనబరచకపోవడంఅధికారుల పనితీరును తెలియజేస్తోంది. జిల్లాకుచెందిన మంత్రి హరీష్‌రావు, ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తరచూ జిల్లాలో పర్యటిస్తున్నారు. సమీక్షసమావేశాల్లో పాల్గొంటున్నారు.వీరి పర్యటన వివరాలు ఎలా లేదన్నా కనీసం 48గంటల ముందు ఖరారవుతుంది.
 
 కానీ ఆ విషయంమాత్రం సమాచార శాఖకు తెలియదు. తీరా సమావేశంజరుగుతున్నప్పుడో... మంత్రి బయలుదేరుతున్నప్పుడో తెలిసి హడావుడిగా మీడియాకు సమాచారంచేరవేస్తున్నారు.దీంతో మీడియా ప్రతినిధులు వార్తలను కవర్‌చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇదేవిషయాన్ని  కొంతమంది మీడియా ప్రతినిధులుగతంలో ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ దృష్టికి తీసుకెళ్లగా... ప్రసార మాధ్యమాలకు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం కేవలం ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యమేనని అన్నారు. దానికి పూర్తి బాధ్యత వారిదేనన్నారు. ఇపికైనా ఆ శాఖ అధికారుల్లో చలనంవస్తుందని ఆశిద్దాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement