పోలీసులకు వారాంతపు సెలవు! | weekly holiday to police's! | Sakshi
Sakshi News home page

పోలీసులకు వారాంతపు సెలవు!

Jun 25 2014 5:07 AM | Updated on Aug 21 2018 9:20 PM

పోలీసులకు వారాంతపు సెలవు! - Sakshi

పోలీసులకు వారాంతపు సెలవు!

సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న పోలీసుల వారంతపు సెలవుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ జిల్లాలో త్వరలో అమలుకానుంది.

త్వరలో అమలుకు ప్రభుత్వం యోచన
ఆదిలాబాద్ క్రైం : సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న పోలీసుల వారంతపు సెలవుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ జిల్లాలో త్వరలో అమలుకానుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఈ విధానం ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన జిల్లాలో కూడా అమల్లోకి వచ్చిన వెంటనే ఏఏ పోలీసు స్టేషన్‌లలో ఎవరెవరికీ ఏఏ రోజు వారంతపు సెలవు ఇవ్వాలనే దాని పై పట్టిక తయారు చేస్తారు. త్వరలో జిల్లా లో వారంతపు సెలవు అమలులోకి తెస్తామని ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు.

ప్రస్తుతం జిల్లాలో ఈ విధానం హోంగా ర్డు, కానిస్టేబుళ్లకు వర్తించనుందా? లేక ఏ ఎస్సై స్థాయి వరకు వర్తిస్తుందా? అనేది తేల్చాల్సి ఉంది. ఇదిలా ఉంటే కానిస్టే బుల్ నుంచి ఏఎస్సై వరకు వారాంతపు సెలవు ఇవ్వాలని జిల్లా పోలీసు అధి కారుల సంఘం నాయకులు ఇప్పటికే జిల్లా ఎస్పీకి విన్నవించారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే జిల్లాలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చి.. వారాం తపు సెలవులు అమలు చేయాలని పోలీసుల కుటుంబాలు కోరుతున్నాయి.
 
సమస్యలతో సతమతం
పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఉన్నవారిపైనే పనిభారం పడుతోంది. శారీరకంగా అలసిపోతున్న పోలీసులకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇటు రోగాలు, అటు ఒత్తిళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పని ఒత్తిడి కారణంగా పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు లేకపోలేదు. పోలీసులు సరైన సమయంలో భోజనం, నిద్ర లేకపోవడంతో షుగర్‌వ్యాధి భారిన పడుతున్నారు.

వీటితోపాటు ఎంతో మంది గుండెజబ్బు, మూత్రపిండాలు, కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. సయమానికి సెలవులు లేక.. కుటుంబాలకు దూరంగా ఉండలేక.. వెను వెంటనే డ్యూటీలు చేయడం.. ద్వారా మానసికంగా కుంగిపోతున్నారు. ఇక ఎన్నికల సమయంలో.. సభలు నిర్వహించే సమయంలో వీరి కష్టాలు చెప్పనక్కర్లేదు.
 
ఏఎస్సై స్థాయి వరకు ఇవ్వాలి..
పోచలింగం నేత, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు
 ప్రభుత్వం పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేసేందుకు కృషి చే     యాలి. మన జిల్లాలోని కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్సై స్థాయి వరకు వారాంతపు సెలవులు ఇవ్వాలని జిల్లా ఎస్పీ భూపాల్‌కు ఇప్పటికే వినతి పత్రం అందజేశాం. ఈ విధానంలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా అమలు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement