‘మా ఇంట్లో లెదర్ ఉత్పత్తులు వాడం’ | We will not use Leather products at home | Sakshi
Sakshi News home page

‘మా ఇంట్లో లెదర్ ఉత్పత్తులు వాడం’

Jul 26 2015 11:39 PM | Updated on Mar 28 2018 11:08 AM

జంతువుల నుంచి తయారు చేసే లెదర్ ఉత్పత్తులు తమ ఇంట్లో వాడటం లేదని బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు

 సెంట్రల్ యూనివర్సిటీ : జంతువుల నుంచి తయారు చేసే లెదర్ ఉత్పత్తులు తమ ఇంట్లో వాడటం లేదని  బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు, సినీ నటి అక్కినేని అమల తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలోని కొండాపూర్ రోడ్‌లో నూతన ’హోం ఎక్స్‌పర్ట్స్’ ఫర్నిచర్, ఇంటీరియర్ షాప్‌ను అక్కినేని అమల ప్రారంభించారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ మా ఇంట్లో ఎవరి గదిని వారే అలంకరించుకుంటారని పేర్కొన్నారు. నాగార్జునతో సహా అందరం ఎవరి అభిరుచులకు అనుగుణంగా గదులను తీర్చిదిద్దుకుంటామన్నారు.

హోం ఎక్స్‌పర్ట్స్ ఎండీ జయభరత్ రెడ్డి మాట్లాడుతూ భారత్‌తో పాటు జర్మనీ, టర్కీ, చైనా, మలేసియా ఉత్పత్తులు నూతన షాపులో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఐఏఎస్ అధికారి రవిగుప్తా, ఐపీఎస్ అధికారులు జాయ్‌దీప్ నాయక్, రమేష్ రెడ్డి, ఐఆర్‌ఎస్ అధికారులు ఎంఆర్ రెడ్డి, చంద్రశేఖర రెడ్డి, మురళీ మోహన్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement