పేదల బతుకుల్లో వెలుగులు నింపుతాం

We Will Fill The Lights In The Poor - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఇంటింటి ప్రచారం 

రైతులకు పంట పెట్టుబడి సాయం

 ఒకే దఫాలో రూ.2లక్షల రుణమాఫీ

సాక్షి, చిన్నచింతకుంట: పేదల స్థితిగతులను అధ్యయనం చేసిన పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటేనని, ఆ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే పేదల బతుకుల్లో వెలుగులు నింపుతామని కాంగ్రెస్‌ మండల ఉపాధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డి, ధనుంజయ్‌ అన్నారు. సోమవారం మండలంలోని తిర్మలాపూర్‌లో కాంగ్రెస్‌  మేనిఫెస్టో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

  కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రెట్టింపు పింఛన్లుతో పాటు రైతులకు పంట పెట్టుబడి సాయం, ఒకే దఫాలో రూ.2లక్షల రుణమాఫీ అందిస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ దేవరకద్ర నియోజకవర్గ యూత్‌ కన్వీనర్‌ మహిపాల్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి అక్బర్, తిర్మలాపూర్‌ గ్రామ ఎంపీటీసీ. సత్యం, కతలప్ప, మాసిరెడ్డి, మధుసూధన్‌రెడ్డి, మహేష్,  శ్రీను పాల్గొన్నారు. 

అమిస్తాపూర్‌లో రెండో రోజు ప్రచారం 
భూత్పూర్‌: మున్సిపాలిటీ పరిదిలోని అమిస్తాపూర్‌లో సోమవారం కాంగ్రెస్‌ నాయకులు ఇంటింటా ప్రచారం చేపట్టారు.   కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన హామీలు అమలు గురించి వివరించారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ అధికారం ఇవ్వాలని వారు కోరారు.  రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని గ్రామాల్లో ఓటర్లకు వివరిస్తున్నారు. పెన్షన్ల పెంపు, తిదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రె‹స్‌ పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, సాధిక్, ఫసియోద్దీన్, ఫారుక్, ఆనంద్‌ ,నరేందర్,,తిరుపతి రెడ్డి,యాదిరెడ్డి,గాల్‌రెడ్డి ,ఆగిరి రవి, హతిరాం పాల్గొన్నారు. 

నేటి నుంచి ముమ్మర ప్రచారం 
మూసాపేట: నేటి నుంచి మండలంలో సభలు సమావేశాలు నిర్వహించి ప్రచారాన్ని ముమ్మరం చేద్దామని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బాల నర్సింహులు, అజయకుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ డోకూర్‌ పవన్‌కుమార్‌రెడ్డి ఇంట్లో కాంగ్రెస్‌ మండల ముఖ్యనాయకులంతా సమావేశమయ్యారు.

  నియోజకవర్గం నుంచి తనకే పోటీ చేసే అవకాశం వచ్చిందని ఢిల్లీలో ఉన్న పవన్‌కుమార్‌ ఫోన్‌లో తెలిపారని, దీంతో నేటి నుంచి ప్రచారం ముమ్మరం చేయాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో శెట్టి శేఖర్, సీఎచ్‌ వెంకటయ్య, సుధాకర్‌రెడ్డి యాదయ్య, వెంకటేష్, సమరసింహారెడ్డి, శ్రీనివాసులు, రవి సాగర్, రాజేందర్‌రెడ్డి, రాంకుమార్‌యాదవ్, నర్సింహారెడ్డి, మహేష్, రాజు, సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top