
మూత్రం పోస్తే వారితోనే కడిగించండి
రోడ్డుపై ఎవరైనా మూత్ర విసర్జన చేస్తే.. వారికి ‘స్వచ్ఛ హైదరాబాద్’ అని చెప్పి, రెండు బకెట్ల నీరు ఇచ్చి వారితోనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించాలని గవర్నర్ నరసింహన్ ప్రజలకు సూచించారు.
హైదరాబాద్: రోడ్డుపై ఎవరైనా మూత్ర విసర్జన చేస్తే.. వారికి ‘స్వచ్ఛ హైదరాబాద్’ అని చెప్పి, రెండు బకెట్ల నీరు ఇచ్చి వారితోనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించాలని గవర్నర్ నరసింహన్ ప్రజలకు సూచించారు. రోడ్డుపై ఎవరైనా చెత్త వేస్తే దానిని వారిచేతే తీయించేలా చూసినప్పుడే క్లీన్ హైదరాబాద్ సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్‌లోని ఆనంద్‌నగర్ కాలనీలో శనివారం ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఆనంద్‌నగర్, వెంకటరమణకాలనీ, పద్మావతినగర్‌లలో నెలకొన్న సమస్యలను స్థానికులు వివరించగా.. గవర్నర్ తన డైరీలో రాసుకున్నారు. ఆనంద్‌నగర్ కాలనీలో ఓ పురాతన ఇంట్లో, వెంకటరమణకాలనీలోని పార్కులో చెత్తను డంప్ చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో వాటిని గవర్నర్ పరిశీలించారు. ఎవరు చేయాల్సిన పని వారు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు