మున్సిపల్ సిబ్బందికి వాకీటాకీలు | wacky talkies for municipal staff | Sakshi
Sakshi News home page

మున్సిపల్ సిబ్బందికి వాకీటాకీలు

May 24 2014 12:31 AM | Updated on Oct 16 2018 6:47 PM

సిద్దిపేట మున్సిపల్ పరిధిలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది నుంచి కమిషనర్ స్థాయి అధికారి వరకు సమాచారం సమన్వయానికి మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

 సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్:  సిద్దిపేట మున్సిపల్ పరిధిలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది నుంచి కమిషనర్ స్థాయి అధికారి వరకు సమాచారం సమన్వయానికి మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రధాన విభాగాలకు చెందిన సిబ్బందికి మున్సిపల్ అధికారులు వాకీటాకీలను అందించారు.

 వీటిని సమన్వయ పరిచేందుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం మున్సిపల్ సిబ్బందికి వాకీటాకీల వినియోగం, వాటి ఉద్దేశం గూర్చి అవగాహన కల్పించారు. సిద్దిపేట పట్టణంలో సుమారు లక్ష జనాభాకు అనుగుణంగా మున్సిపల్ సేవలను సత్వరం అందించేందుకు కమిషనర్ రమణాచారి 31 వాకీటాకీలను సిబ్బందికి పంపిణీ చేశారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, పన్నుల వసూలు, ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్, పరిపాలన విభాగంతో పాటు వీధి దీపాలు లాంటి ముఖ్య విభాగాలు అధికారులకు వీటిని అందించనున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలు, పారిశుద్ధ్య సమస్యలు, నీటి సరఫరాలో ఎదురయ్యే అవాంతరాలను ఎప్పటికప్పుడు మెరుగు పర్చుకునేందుకు వీటిని వినియోగించనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కొన్ని విభాగాలకు చెందిన సిబ్బందికి వీటి వినియోగం గూరించి వివరిస్తూ అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement