విశ్వరూప విజయవంతం | Viswaroopa Success | Sakshi
Sakshi News home page

విశ్వరూప విజయవంతం

Sep 9 2014 12:49 AM | Updated on Sep 2 2017 1:04 PM

విశ్వరూప విజయవంతం

విశ్వరూప విజయవంతం

చంద్రకాంతులు వెదజల్లుతున్న వేళ... భక్తుల జయజయధ్వానాల మధ్య కైలాస విశ్వరూప మహాగణపతి దుర్గామాత వెంటరాగా ‘మహా’రథంపై ఆశీనుడయ్యాడు.

చంద్రకాంతులు వెదజల్లుతున్న వేళ... భక్తుల జయజయధ్వానాల మధ్య కైలాస విశ్వరూప మహాగణపతి దుర్గామాత వెంటరాగా ‘మహా’రథంపై ఆశీనుడయ్యాడు. వేల మెగావాట్ల విద్యుత్ దీప కాంతుల మధ్య జరిగిన ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించి భక్తకోటి తరించింది. ‘జై బోలో గణేశ్ మహరాజ్ కీ’ అంటూ స్తుతించింది. ఆనంద పరవశంతో నర్తించింది. వెరసి ‘ఆపరేషన్ విశ్వరూప’ విజయవంతమైంది. సోమవారం అర్ధరాత్రి సమీపిస్తున్న తరుణంలో భారీగణపయ్య గంగ ఒడికి కదిలాడిలా..!   
 
 అపురూప ఘట్టాలు..
 మధ్యాహ్నం 3 గంటలకు:  క్రేన్ మహాగణపతి ప్రాంగణానికి చేరుకుంది.
 3.20: భారీ వాహనం పొజిషన్ తీసుకుంది.
 4.00: భక్తుల దర్శనం నిలిపివేశారు.
 4.50: లక్ష్మీనర్శింహ స్వామి విగ్రహాన్ని కదిలించేందుకు క్రేన్ సిద్ధమైంది.
 5.00: భక్తులు ఎక్కువగా ఉండడంతో వారిని మళ్లీ దర్శనానికి అనుమతించారు.
 6.00: తిరుమల తిరుపతి దేవస్థానం కళాకారుల కోలాట ప్రదర్శన
 6.10: క్రేన్‌కు పూజలు
 7.30: లక్ష్మీ నర్శింహ స్వామి విగ్రహాన్ని పైకి లేపి మండపానికి దూరంగా పెట్టారు.
 8.00: లడ్డూపై నున్న గొడుగును తొలగించారు.
 8.30: లడ్డూని కిందకు దించారు.
 9.50: దుర్గామాత విగ్రహాన్ని పైకిలేపి వాహనంపై ఉంచారు.
 9.55: కైలాస విశ్వరూపుడి విగ్రహానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చివరి పూజ చేశారు.
 10.10: మహాగణపతిని పైకి లేపేందుకు విగ్రహం అడుగుభాగంలో వైర్లను అమర్చారు.
 10.15: భారీ వినాయకుడిని వాహనంపై అమర్చేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది.
 10.35: కైలాస విశ్వరూపుడి విగ్రహాన్ని కొంచెం కదిలించారు.
 10.55: భారీ గణనాథుడ్ని వాహనంపై అమర్చారు.
 11.00: వాహనానికి వెల్డింగ్ పనులు మొదలయ్యాయి.
 అర్ధరాత్రి తర్వాత విశ్వరూపుడు శోభాయాత్రకి కదిలాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement