రేపు ఖమ్మంలో వెంకీమామ ప్రీ రిలీజ్‌ వేడుక

Venky Mama Pre Release Ceremony at Khammam - Sakshi

ఈవెంట​ ఆర్గనైజర్‌ గండ్ర శ్రీనివాస్‌

ఖమ్మం మయూరి సెంటర్‌ : సురేష్‌ ప్రొడక్షన్‌ అండ్‌ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం వెంకీమామ ప్రీ రిలీజ్‌ వేడుకను ఈ నెల 7వ తేదీన నగరంలోని లేక్‌వ్యూ క్లబ్‌ ఆవరణలో నిర్వహించనున్నట్టు శ్రేయాస్‌ మీడియా అధినేత, ఈవెంట్‌ ఆర్గనైజర్‌ గండ్ర శ్రీనివాస్‌ తెలిపారు. లేక్‌వ్యూ క్లబ్‌ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు బాబీ, సురేష్‌ ప్రొడక్షన్‌ అధినేత సురేష్‌ బాబు, హీరోలు విక్టరీ వెంకటేష్‌, నాగ చైతన్య, హీరోయిన్‌లు రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌, సంగీత దర్శకుడు థమన్‌, హాస్యనటుడు హైపర్‌ ఆదిలు విచ్చేస్తారని తెలిపారు.

థమన్‌ మ్యూజికల్‌ నైట్‌, హైపర్‌ ఆది స్కిట్స్‌, సత్యా మాస్టర్‌ బృందం నృత్య ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. యాంకర్‌గా శ్రీముఖి వ్యవహరిస్తారని తెలిపారు. రెండున్నర గంటల పాటు వేడుక నిర్వహించనున్నట్టు తెలిపారు. సినీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో దొడ్డారవి, రావూరి సైదుబాబుచ, చారుగండ్ల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top