కేంద్ర సమాచార శాఖ డీజీగా వెంకటేశ్వర్‌ | Venkateshwar Take Charge As The Central Information Department DG | Sakshi
Sakshi News home page

కేంద్ర సమాచార శాఖ డీజీగా వెంకటేశ్వర్‌

Nov 15 2019 9:35 PM | Updated on Nov 15 2019 9:37 PM

Venkateshwar Take Charge As The Central Information Department DG - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర సమాచార శాఖ (తెలంగాణ) డైరెక్టర్‌ జనరల్‌గా ఎస్‌.వెంకటేశ్వర్‌ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించిన ఆయన డెప్యుటేషన్‌ అనంతరం బదిలీపై హైదరాబాద్‌కు వచ్చారు. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్‌ ఫర్‌ ఇండియా హైదరాబాద్‌ కార్యాలయ అదనపు ప్రెస్‌ రిజిస్ట్రార్‌గా కూడా వ్యవహరిస్తారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన రీజినల్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరోకు అధిపతిగా కూడా ఉంటారు. గతంలో ఆయన ప్రసార మంత్రిత్వ శాఖలో పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన 30 ఏళ్ల పదవీకాలంలో పత్రికా సమాచార కార్యాలయం బెంగుళూరు అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా, ఏపీ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా, ఆల్‌ ఇండియా రేడియో, దూరదర్శన్‌లలో డైరెక్టర్‌గా, భవనేశ్వర్‌ పత్రికా సమాచార కార్యాలయం డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో  పనిచేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement