ఈ రోజు అర్థరాత్రి నుంచి ఓఆర్‌ఆర్‌పై రాకపోకలు

Vehicles Allowed On Hyderabad ORR From Today Midnight - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా రాకపోకలు నిషేధించిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై బుధవారం అర్థరాత్రి నుంచి వాహనాలకు అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు అర్థరాత్రి నుంచి ఓఆర్‌ఆర్‌పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ), హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌( హెచ్‌జీసీఎల్‌) నిర్ణయించాయి. అయితే ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్‌ఆర్‌పై టోల్‌గేట్‌ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించింది. (ఎమ్మెల్యేను బలిగొన్న మహమ్మారి)

కాగా ఓఆర్ఆర్‌ టోట్‌ప్లాజాల వద్ద ఫాస్ట్‌టాగ్ నిబందనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్​ పేమెంట్​ పద్ధతిలో ఫాస్ట్‌టాగ్​ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్ఎండీఎ సూచించింది. అయితే కర్ఫ్యూ అమలులో ఉన్న వేళలు (రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ) ఓఆర్ఆర్‌పై కార్లను అనుమతించడం జరగదు. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల(గూడ్స్​ వెహికిల్స్​)లో ప్రయాణీకులు ఉన్నట్లుగా టోల్‌ప్లాజా సిబ్బంది గుర్తిస్తే స్థానిక పోలీస్​స్టేషన్‌కు సమాచారం అందజేయాలని సిబ్బందిని హెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు. (చైనా భయం.. భారత్‌కు వరం )

‘ఔటర్‌’పై రైట్‌ రైట్‌!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top