ఎమ్మెల్యేను బలిగొన్న మహమ్మారి | Pakistani Lawmaker Shaheen Raza Deceased Of Coronavirus | Sakshi
Sakshi News home page

పాక్‌ చట్టసభ సభ్యురాలి మృతి

May 20 2020 6:43 PM | Updated on May 21 2020 2:08 AM

Pakistani Lawmaker Shaheen Raza Deceased Of Coronavirus - Sakshi

కోవిడ్‌-19తో పాలక తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ నేత షహీన్‌ రజా మరణం

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో పాలక తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ నుంచి చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న షహీన్‌ రజా (65) కరోనా మహమ్మారితో బాధపడుతూ బుధవారం మరణించారు. షహీ్న్‌ రజా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన పంజాబ్‌ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైరస్‌తో పోరాడుతూ ఆమె తుదిశ్వాస విడిచారని మయో ఆస్పత్రి సీఈఓ డాక్టర్‌ అసద్‌ ఆలం వెల్లడించారు.

కాగా పంజాబ్‌ ప్రావిన్స్‌లో క్వారంటైన్‌ సెంటర్లను ఆమె తరచూ సందర్శించారని,అంతకుముందు ఆమె క్యాన్సర్‌ బారినపడి కోలుకున్నారని పంజాబ్‌ ఆరోగ్య మంత్రి యాస్మిన్‌ రషీద్‌ తెలిపారు. ఇక పాక్‌లో ఇప్పటివరకూ 45,898 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా 985 మంది మరణించారు.

చదవండి : ఐదు నిమిషాల్లో కరోనా నిర్థారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement