జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)లో స్ప్రింగ్ స్ప్రీ-15 సంబరాలు కేక పెట్టిస్తున్నారుు
జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)లో స్ప్రింగ్ స్ప్రీ-15 సంబరాలు కేక పెట్టిస్తున్నారుు. ఉరిమె ఉత్సాహంతో విద్యార్థులు ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. విజ్ఞాన ప్రాంగాణంలో శనివారం ఫేస్ పెయింటింగ్, నిట్ మూవ్, గేమ్‌డోమ్, పెయిర్ డ్యాన్స్, వన్స్‌స్టేజ్, రంగోళి, ఫొటో మేకింగ్ తదితర ప్రదర్శనలు అబ్బురపరిచారుు. హాస్య సన్నివేశాలు కడుపుబ్బ నవ్వించాయి.
ఇంద్రజాల ప్రదర్శనలు ఔరా అనిపించాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అంధ విద్యార్థులు మధు, రెడ్డి, వెంకట్‌తో.. అంధులైన చిన్నారులకు క్రికెట్ శిక్షణ ఇచ్చారు. క్లాసికల్, వెస్ట్రన్, డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. నిట్ డెరైక్టర్ ఎన్.శ్రీనివాసరావు శనివారం పోటీలను ప్రారంభించారు. ఎన్‌ఐటీ ప్రాంగాణంలో వివిధ కంపెనీల ఉత్పత్తులను అమ్మకానికి పెట్టారు. దేశవిదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు సందడి చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఫ్రెండ్స్ ఆఫ్ మేక్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో కాకినాడకు చెందిన ఎన్‌ఐటీ విద్యార్థి రాజేష్ పాములతో ప్రదర్శన నిర్వహించి ఆకట్టుకున్నాడు.