పాల్వాయిది కాంగ్రెస్‌లో ప్రత్యేక స్థానం: ఉత్తమ్‌ | Uttam tributes palvai Govardhan Reddy | Sakshi
Sakshi News home page

పాల్వాయిది కాంగ్రెస్‌లో ప్రత్యేక స్థానం: ఉత్తమ్‌

Jun 9 2017 7:38 PM | Updated on Sep 19 2019 8:44 PM

పాల్వాయిది కాంగ్రెస్‌లో ప్రత్యేక స్థానం: ఉత్తమ్‌ - Sakshi

పాల్వాయిది కాంగ్రెస్‌లో ప్రత్యేక స్థానం: ఉత్తమ్‌

రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ లో ప్రత్యేక స్థానం ఉందని..

ఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ లో ప్రత్యేక స్థానం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పాల్వాయి మృతికి తన సంతాపాన్ని ప్రకటించారు. పాల్వాయి పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారన్నారు. కాంగ్రెస్ కోసం నెహ్రూ హయాం నుంచి విశేష కృషి చేశారని గుర్తుచేసుకున్నారు.

ప్రజా ప్రతినిధిగా నిస్వార్ధంగా ప్రజలకు సేవలందించారని, పాల్వాయి తమ మధ్య లేకపోవడాన్ని నమ్మలేక పోతున్నామన్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు పాల్వాయి స్వగ్రామం చండూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం హైదరాబాదులోని నివాసంలో రెండు గంటలపాటు, తరువాత గాంధీ భవన్ లో కొద్దిసేపు పాల్వాయి పార్దివ దేహాన్ని ఉంచుతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement