బాలికకు టిఫిన్‌ తినిపిస్తానని తీసుకెళ్లి.. | Unidentified Person raped a 7 years old Girl | Sakshi
Sakshi News home page

బాలికకు టిఫిన్‌ తినిపిస్తానని తీసుకెళ్లి..

Mar 26 2017 11:00 AM | Updated on Jul 28 2018 8:53 PM

బాలికకు టిఫిన్‌ తినిపిస్తానని తీసుకెళ్లి.. - Sakshi

బాలికకు టిఫిన్‌ తినిపిస్తానని తీసుకెళ్లి..

అభంశుభం తెలియని ఓ చిన్నారిని టిఫిన్‌ చేపిస్తానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

వికారాబాద్‌: జిల్లాలోని తాండూరులో ఘోరం వెలుగుచూసింది. అభంశుభం తెలియని ఓ చిన్నారిని టిఫిన్‌ చేపిస్తానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. వివరాలు.. తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన ఓ బాలిక(7) తన నానమ్మతో కలిసి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామిర్శించేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఒంటిరిగా కూర్చున్న బాలికను ఓ యువకుడు టిఫిన్‌ తినిపిస్తానని చెప్పి శనివారం సాయంత్రం బయటకు తీసుకెళ్లాడు.
 
రాత్రైనా బాలిక ఆచూకి లభించకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి ప్రాంతంలో రోడ్లు ఊడుస్తున్న పారిశుధ్య కార్మికులకు చెట్ల పొదల్లో నుంచి ఓ బాలిక మూలుగులు వినిపించడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. కార్మికుల చప్పుడు విన్న యువకుడు బాలికను అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement