పట్టాలపై గుర్తుతెలియని శవం | unidentified body on train tracks | Sakshi
Sakshi News home page

పట్టాలపై గుర్తుతెలియని శవం

Nov 8 2015 7:22 PM | Updated on Mar 28 2018 11:11 AM

మేడ్చల్ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం ఆదివారం లభ్యమైంది

మేడ్చల్ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం ఆదివారం లభ్యమైంది. రైలు వ్యక్తి మీద వెళ్లడంతో.. శరీరం ముక్కలు ముక్కలుగా తెగిపడింది. చెల్లాచెదురైన శరీర భాగాలను గుర్తించిన స్థానికులు మేడ్చల్‌ పోలీసులకు సమాచారం అందించారు. మేడ్చల్ పోలీసులు, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అటుగా ఎవరూ వెళ్లకపోవడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతుడి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.



 

Advertisement
 
Advertisement
Advertisement