టీఆర్‌ఎస్‌తోనే గ్రామాలు అభివృద్ధి  | Under TRS, Gram Panchayats see best growth phase | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తోనే గ్రామాలు అభివృద్ధి 

Nov 19 2018 9:14 AM | Updated on Mar 6 2019 6:10 PM

Under TRS, Gram Panchayats see best growth phase - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గుడిపల్లి, బొందపల్లి, పెద్దాపూర్, శ్రీపురం, నాగనూల్, నెల్లికొండ, ఎండబెట్లలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఇరువురికి ఘనస్వాగతం పలికారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే మరోమారు టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని, ప్రతీ ఒక్కరూ కారుగుర్తుకు ఓటు వేసి గెలిపాంచాలన్నారు. ప్రాణం ఉన్నంత వరకు నాగర్‌కర్నూల్‌ ప్రజలకు సేవచేసుకుంటానన్నారు. మరోమారు కాంగ్రెస్‌ నాయకులు ఓట్లకోసం ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారని.. వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ మాయా కూటమి మరోమారు మోసగించేందుకు ముందుకువచ్చారని.. వారిని నమ్మితే మోసపోవడం ఖాయమన్నారు. రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌ యాదవ్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. 


తెలకపల్లి: మండలంలోని దాసుపల్లి, లక్నారంలో నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సతీమణి మర్రి జమున ఇంటింటి ప్రచారం చేశారు. దాసుపల్లి, లక్నారంలో ఇంటింటికి వెళ్లి మర్రి జనార్దన్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పింఛన్లు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబంధు తదితర సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు.

నియోజకవర్గాన్ని మర్రి జనార్దన్‌రెడ్డి అభివృద్ధి చేశారని, సొంత ఖర్చులతో కాల్వలు తీసి కేఎల్‌ఐ నీరందించారన్నారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే అన్నిరకాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆమెవెంట తెలకపల్లి మాజీ సర్పంచ్‌ నిర్మల లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీ నరేందర్‌రెడ్డి, భాగ్యమ్మ, నర్మద, రాజేందర్‌రెడి పాల్గొన్నారు. 


కళ్లముందున్న అభివృద్ధిని చూడండి 

నాగర్‌కర్నూల్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో నాగర్‌కర్నూల్లో జరిగిన, కళ్లముందున్న అభివృద్ధిని చూడాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి సతీమణి మర్రి జమున అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో ఆదివారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ టీఆర్‌ఎస్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు.

మర్రి జనార్దన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో ఉన్న చనువుతో నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తేవడం జరిగిందన్నారు. గతంలో ఉన్న నాయకులు చేయలేని అభివృద్ధి పనులు కూడా చేయించారన్నారు. మరింత అభివృద్ధి చెందాలంటే మరోమారు మర్రిని గెలిపించాలన్నారు. ఆమె వెంట పట్టణానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

 
తాడూరు: మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశారు. నాలుగున్నర ఏళ్ల నుంచి నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదని టీఆర్‌ఎస్‌ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని ప్రచారం సాగిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలకు అందేవిధంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని మరోసారి టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. 


తిమ్మాజిపేట: మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలంలోని తిమ్మాజిపేట, మరికల్, పుల్లగిరి, ఆర్‌సీ తండా, అవంచ తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే మళ్లీ టీఆర్‌ఎస్‌కే ఒటేయ్యాలని ప్రజలను కోరారు. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మరోసారి మర్రి జనార్దన్‌రెడ్డిని గెలిపించాలన్నారు. వేణుగోపాల్‌గౌడ్, ప్రదీప్, స్వామి, కోటీశ్వర్, వెంకటేష్, శ్రీను, అబ్దుల్‌ఆలీ, వహీద్‌  పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement