బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి తిట్ల పురాణం | Nagar Kurnool MLA Marri Janardhan Reddy Anger At public Meeting | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి తిట్ల పురాణం.. సహనం కోల్పోయి జనంపై చిందులు

Aug 28 2023 1:12 PM | Updated on Aug 28 2023 2:52 PM

Nagar Kurnool MLA Marri Janardhan Reddy Anger At public Meeting - Sakshi

సాక్షి, మహూబూబ్‌నగర్‌: నాగర్ కర్నూల్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. సహనం కోల్పోయి ప్రజలపై చిందులు వేశారు. కోపం తట్టుకోలేక కాల్చిపడేస్తానంటూ ఊగిపోయారు. ఇదంతా విన్న ప్రజలు నిస్తుపోయారు. గత మూరు రోజులుగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 10 ఏళ్ల ప్రజాప్రస్థానం పేరుతో నియోజకవర్గంలో యాత్ర కొనసాగిస్తున్నారు. 

ఈ క్రమంలో ఆదివారం రాత్రి తెలకపల్లి మండలం బొబ్బిలిలో యాత్ర కొనసాగింది. రాత్రి 9 గంటలకు గ్రామంలో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రసంగం సందర్భంగా అల్లరి చేశారు. ప్రసంగాన్ని అడ్రుకునే ప్రయత్నం చేశారు.

దీనితో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఒక్క సారిగా ఆవేశానికి గురయ్యారు. ప్రత్యర్థి వర్గాన్ని దూషిస్తూ వేదికపై నుండి విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కాల్చిపడేస్తానంటూ ఊగిపోయారు. తిట్ల పురాణంతో దూషణలతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ఆవేశపూరిత మాటలతో గందరగోళం నెలకొంది.
చదవండి: దిశా కేసులో కీలక మలుపు.. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న విచారణ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement