సీఎం కోసం.. అత్యాధునిక వాహనం రెడీ! | ulta modern vehicle gets ready for chief minister kcr | Sakshi
Sakshi News home page

సీఎం కోసం.. అత్యాధునిక వాహనం రెడీ!

Jul 2 2015 5:25 PM | Updated on Aug 15 2018 8:12 PM

సీఎం కోసం.. అత్యాధునిక వాహనం రెడీ! - Sakshi

సీఎం కోసం.. అత్యాధునిక వాహనం రెడీ!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోసం ఓ అత్యాధునికమైన బస్సు తయారైంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోసం ఓ అత్యాధునికమైన బస్సు తయారైంది. చండీగఢ్లో తయారుచేసిన ఈ బస్సును.. హైదరాబాద్ నగరానికి గురువారం తీసుకొచ్చారు. ఈ బస్సు తయారీకి మొత్తం రూ. 5 కోట్ల వరకు ఖర్చయింది. రాత్రిపూట బస చేసేందుకు కూడా వీలుగా హైసెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఈ బస్సులో అత్యాధునిక హంగులు కూడా ఉన్నాయి.

వీడియో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు కూడా ఇందులో ఏర్పాట్లు చేశారు. ఇందులో వై-ఫైతో పాటు అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఈ వాహనం హైదరాబాద్ నగరానికి రావడంతో.. ముఖ్యమంత్రికి ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇక్కడ కావల్సిన ఏర్పాట్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. దీన్ని కేసీఆర్కు అందుబాటులోకి తీసుకెళ్తారని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement