గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌ | Two young people arrested for selling gudumba | Sakshi
Sakshi News home page

గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

Mar 23 2016 3:00 AM | Updated on Jul 11 2019 8:43 PM

పట్టణంలోని బట్టిగూడెం, ఎనగుట్ట (ఎమ్మెల్యే) కాలనీల్లో గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరిని పట్టుకొని మంగళవారం ....

చెన్నూర్ : పట్టణంలోని బట్టిగూడెం, ఎనగుట్ట (ఎమ్మెల్యే) కాలనీల్లో గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరిని పట్టుకొని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ తెలిపారు.బట్టిగూడెం కాలనీలో గిరెల్లి లచ్చయ్య, ఎనగుట్టలో గుండా సంతోష్ గుడుంబా విక్రయిస్తుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నామన్నారు. లచ్చయ్య వద్ద 8 లీటర్లు, సంతోష్ వద్ద 10 లీటర్ల గుడుంబాతోపాటు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇద్దరిపై ఎక్సైజ్ కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై దిలీప్‌కుమార్, సిబ్బంది కుమారస్వామి, రాజయ్య, సుకన్య పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement