వివాహేతర బంధానికి బలి | two people died for Fornication | Sakshi
Sakshi News home page

వివాహేతర బంధానికి బలి

Feb 23 2018 1:39 AM | Updated on Sep 28 2018 3:48 PM

two people died for Fornication - Sakshi

కాశీరాం, దేవేంద్ర

తూప్రాన్‌: వివాహేతర సంబంధం ఇద్దరిని బలితీసుకుంది. గురువారం తెల్లవారు జామున రైలు కింద పడి బలవంతంగా తనువు చాలించారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. కామారెడ్డి రైల్వే ఎస్సై తావునాయక్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. కామారెడ్డిలోని పద్మాజివాడకు చెందిన ఒంటెద్దు కాశీరాం(35) వరుసకు మరదలైన దేవేంద్ర(30)తో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దేవేంద్ర భర్త రఘు ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. వీరికి 5 ఏళ్ల బాబు, ఏడాది పాప ఉంది.  కాశీరాంకు కూడా గతంలోనే పెళ్లి జరి గింది. కుటుంబ తగాదాల కారణంగా భార్య తో విడాకులు తీసుకున్నాడు. ఈ సమయంలో ఒంటరిగా ఉంటున్న దేవేంద్రతో సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకు న్నాయి. కులపెద్దలు పంచాయితీ నిర్వహించి కాశీరాంకు రూ.3 లక్షల వరకు జరిమానా విధించారు. ఈ విషయం దుబాయ్‌లో ఉన్న రఘుకు తెలియంతో భార్య తనకు వద్దని కులపెద్దలతో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కాశీరాం, దేవేంద్ర బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్‌లో  రాత్రి రైలు దిగిన వారు తమ వెంట ఉన్న దేవేంద్ర కూతురును స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై వదిలిపెట్టి రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement