నల్లగొండ జిల్లా సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
నల్లగొండ: నల్లగొండ జిల్లా సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని కేతేపల్లి మండలం బీమారం గ్రామానికి చెందిన కృష్ణ, యూనస్ సూర్యాపేట వైపు బైక్‌పై వెళ్తుండగాగుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొని వెళ్లిపోయింది. సంఘటన స్థలంలోనే వారిద్దరూ ప్రాణాలొదిలారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.