breaking news
new bus stand
-
దుబ్బాకలో టెన్షన్ వాతావరణం
-
దుబ్బాకలో ఉద్రిక్తత.. బస్టాండ్ ప్రారంభోత్సవంపై రగడ..
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక మండలం హబ్సిపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గోడౌన్ ప్రారంభోవోత్సవలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలకు మంత్రి హరీష్ రావు సర్దిచెప్పారు. బస్టాండ్ వేదికగా దుబ్బాకలో రాజకీయాలు వేడేక్కాయి. ఉప ఎన్నిక సమయంలో కొత్త బస్టాండ్ నిర్మిస్తామని బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు అప్పట్లో హామీ ఇచ్చాయి. అనుకున్నట్లుగానే సకల హంగులతో రూ. 4కోట్ల వ్యయంతో ఏడాదిన్నర కాలంలోపే నిర్మాణం పూర్తి చేశారు. దుబ్బాక బస్టాండ్‌ను మంత్రి హరీష్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ క్రమంలో బస్టాండ్ క్రెడిన్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ఇరు పార్టీలు యత్నిస్తున్నాయి. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చామని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే.. తాను అసెంబ్లీలో ప్రస్తావించడం వల్లే బస్టాండ్ పూర్తైందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. దుబ్బాక బస్టాండ్ ప్రారంభోత్సవంపై రగడ నెలకొంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సవాళ్లతో పొలిటికల్ హీట్ రాజుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ర్యాలీకి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో నూతన బస్టాండ్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లోకి బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు ప్రవేశం నిషేధించారు. బస్టాండ్ ప్రాంగణంలోకి ఎవ్వరిని అనుమతించలేదు. సిద్ధిపేట సీపీ శ్వేతా దుబ్బాక పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బస్టాండ్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లకు డ్రెస్‌కోడ్ పెట్టారు పోలీసులు. చదవండి: Hyderabad: నిప్పంటించుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చదవండి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి -
పిల్లరే పడదాయె..!
ఖమ్మంమామిళ్లగూడెం : దినదినాభివృద్ధి చెందుతున్న నగరం.. చుట్టుపక్కల మండలాలు, గ్రామాల ప్రజలు, రైతులు నిత్యం పనుల కోసం బస్సుల్లో జిల్లా కేంద్రానికి వస్తుండటంతో రద్దీ పెరిగిపోయింది. ఉద్యోగులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తుండటం.. పాత బస్టాండ్ ప్రాంతం బస్సులు తిరిగేంత వీలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనిని గుర్తించి కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం ఎన్నెస్పీ స్థలాన్ని ఎంపిక చేసి.. అక్కడ ఆధునిక హంగులు, సకల సౌకర్యాలతో నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ.25కోట్లు మంజూరు చేసింది. 2018, జనవరి 18వ తేదీన నిర్మాణ పనులు ప్రారంభించినా.. ముందుకెళ్లడం లేదు. గుంతలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని ఎన్నెస్టీ రోడ్లో 7 ఎకరాల 13 కుంటల స్థలంలో రూ.25కోట్ల వ్యయంతో హైటెక్ హంగులతో కొత్త బస్టాండ్ నిర్మాణం చేపడతామని సీఎం కేసీఆర్, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు బస్టాండ్ స్థల పరిశీలనకు వచ్చిన సందర్భంలో పేర్కొన్నారు. అనుకున్న మేరకు స్థలం కేటాయించిన తర్వాత చాలా రోజులకు బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి...నిర్మాణ పనులు చేపట్టారు. ఏడాది గడిచినప్పటికీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందోనని నగర ప్రజలు ఎదురుచూస్తున్నారు. నిధులు విడుదలైనా.. ఏళ్ల క్రితం జిల్లా కేంద్రంలో నిర్మించిన బస్టాండ్ ప్రస్తుతం వస్తున్న బస్సులకు సరిపోవడం లేదు. దీంతో కొత్త బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడంతోపాటు నిధులు సైతం విడుదల చేసింది. గత ఏడాది జూన్‌లో పనులు ప్రారంభించినా.. ఇప్పటివరకు కనీసం పిల్లర్ల స్థాయికి కూడా చేరలేదు. నిర్మాణ పనులు చూసిన వారంతా.. ఇలా అయితే ఇంకా పదేళ్లకు పనులు కావొచ్చని చర్చించుకుంటున్నారు. పని ప్రదేశంలో కనీసం నిర్మాణానికి అవసరమైన మిషన్లు, సామగ్రి, కూలీలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఆలస్యంగా పనులు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. పనులు ప్రారంభమైనప్పటికీ కనీసం సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కూడా లేవనే విమర్శలొస్తున్నాయి. పాత బస్టాండ్‌లో ఇక్కట్లు.. కొత్త బస్టాండ్ నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని భావిస్తే.. అది కాస్తా జాప్యం కావడంతో పాత బస్టాండ్‌కు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌కు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి రోజూ దాదాపు 1,250 బస్సులు వస్తూ.. పోతుంటాయి. వేలాది మంది ప్రయాణికులు ఖమ్మం బస్టాండ్ నుంచి వారివారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. అలాగే రైళ్ల ద్వారా వచ్చి బస్సుల్లో ప్రయాణించే వారు కూడా అధికమే. ప్రయాణికులు, బస్సుల సంఖ్యకు అనుగుణంగా బస్టాండ్ ప్రాంగణం లేకపోవడంతో బస్సులు తిరిగేందుకు ఇబ్బందికరంగా మారింది. ఇక వర్షాకాలంలో ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బస్టాండ్ చుట్టూ నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండడంతో బస్సులు బస్టాండ్‌లోకి రావాలన్నా.. వెళ్లాలన్నా నరకమే కనపిస్తోంది. ఆటోలు, తోపుడు బండ్ల వల్ల బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లేందుకు ఎక్కువ సమయం పడుతోందని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. త్వరగానే పూర్తి చేస్తాం.. జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. పాత బస్టాండ్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవమే. 2019, మార్చి 18 వరకు కొత్త బస్టాండ్ నిర్మాణం పూర్తవుతుంది. ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. – ఎస్వీజీ.కృష్ణమూర్తి, ఆర్టీసీ ఆర్ఎం అందుబాటులోకి తేవాలి.. పాత బస్టాండ్ వల్ల ట్రాఫిక్‌కు తరచూ అంతరాయం కలుగుతోంది. దీనివల్ల వాహనాలతోపాటు బస్సులకు ఇబ్బందికరంగా మారింది. కొత్త బస్టాండ్ నిర్మాణం త్వరగా పూర్తిచేసి అందుబాటులో తేవాలి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన బస్టాండ్ నిర్మాణం పూర్తయితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. – బ్రహ్మానందరెడ్డి, స్థానికుడు -
వాహనం ఢీకొని ఇద్దరు మృతి
నల్లగొండ: నల్లగొండ జిల్లా సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని కేతేపల్లి మండలం బీమారం గ్రామానికి చెందిన కృష్ణ, యూనస్ సూర్యాపేట వైపు బైక్‌పై వెళ్తుండగాగుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొని వెళ్లిపోయింది. సంఘటన స్థలంలోనే వారిద్దరూ ప్రాణాలొదిలారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
బస్టాప్ ఏర్పాటు చేయండి
వేలూరు, న్యూస్‌లైన్:వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ముత్తు మండపం వద్ద బస్టాప్ ఏర్పాటు చేయాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సభ్యులు కలెక్టర్ నందగోపాల్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. వేలూరు కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు సమస్యలను అధికారులకు విన్నవించారు. సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం పుదు వాయువు పథకం కింద జిల్లాలోని నాలుగు యూనియన్లలోని మహిళలకు రూ.29.5 లక్షలు అందజేశారు. ఆంబూరు ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో శివ ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుం బానికి రూ.3 లక్షలు, పది మంది వికలాంగులకు రూ.5.85 లక్షలు విలువ చేసే మూడు చక్రాల వాహనాలు, ఇద్దరు వికలాంగులకు కృత్రిమ కాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్, వికలాం గుల సంక్షేమశాఖ జిల్లా అధికారి చార్లెస్ ప్రభాకరన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.