వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ముత్తు మండపం వద్ద బస్టాప్ ఏర్పాటు చేయాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సభ్యులు కలెక్టర్
బస్టాప్ ఏర్పాటు చేయండి
Oct 29 2013 4:15 AM | Updated on Mar 21 2019 8:35 PM
వేలూరు, న్యూస్‌లైన్:వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ముత్తు మండపం వద్ద బస్టాప్ ఏర్పాటు చేయాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సభ్యులు కలెక్టర్ నందగోపాల్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. వేలూరు కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు సమస్యలను అధికారులకు విన్నవించారు. సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అనంతరం పుదు వాయువు పథకం కింద జిల్లాలోని నాలుగు యూనియన్లలోని మహిళలకు రూ.29.5 లక్షలు అందజేశారు. ఆంబూరు ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో శివ ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుం బానికి రూ.3 లక్షలు, పది మంది వికలాంగులకు రూ.5.85 లక్షలు విలువ చేసే మూడు చక్రాల వాహనాలు, ఇద్దరు వికలాంగులకు కృత్రిమ కాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్, వికలాం గుల సంక్షేమశాఖ జిల్లా అధికారి చార్లెస్ ప్రభాకరన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement