బైక్ బోల్తాపడి ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి | two engineering students died as bike overturns | Sakshi
Sakshi News home page

బైక్ బోల్తాపడి ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి

May 10 2015 7:36 AM | Updated on Aug 30 2018 3:56 PM

బైక్ బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృత్యువాతపడ్డారు.

జనగామ (వరంగల్): బైక్ బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన వరంగల్ జిల్లా జనగామలో శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జనగామకు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గోపగాని సుమంత్‌రెడ్డి, గోపగాని సతీష్ బైక్‌పై వేగంగా వెళుతుండగా పట్టణంలోని రైల్ ఓవర్ బ్రిడ్జిపై అదుపుతప్పి బోల్తా కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి శనివారమే పరీక్షలు ముగిశాయి. కాగా రాత్రి వేళ సరదాగా బయటకు వెళ్లి మృత్యువాతపడడంతో వారిళ్లలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement