‘చేయి దాటిపోయింది.. చర్చలు జరపలేం’

TSRTC Strike: TS Govt Request To TS High Court To Declare RTC Strike Illegal - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున అడిషినల్‌ అడ్వొకేట్‌ జనరల్‌( ఏజీ) వాదనలు వినిపిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె చట్టవిరుద్ధమని కోర్టుకు వివరించారు. ‘ పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌22(1)ఏ, ప్రొహిబిషన్‌ ఆఫ్‌ స్ట్రైక్‌ యాక్ట్‌ ప్రకారం సమ్మె ఇల్లీగల్‌. చట్టం ప్రకారం ఆరు నెలల ముందు నోటీసులు ఇవ్వాలి. సమ్మెకు కనీసం 14 రోజుల ముందు ప్రభుత్వంకు తెలపాలి. కానీ కార్మికులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సెక్షన్‌ 24 ప్రకారం కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం’  అని ఏజీ హైకోర్టుకు వివరించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను హైకోర్టుకు తెలిపారు. 

డిమాండ్లను పరిష్కరించలేం
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్పొరేషన్‌ పరిస్థితి అస్సలు బాగాలేదని, సమ్మె కారణంగా ఇప్పటి వరకు 44శాతం నష్టపోయినట్లు కోర్టుకు వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులతో చర్చలు జరపలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. యూనియన్లు విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కకుపెట్టినా, తిరిగి ఏ క్షణమైనా ఆ డిమాండ్‌ను తిసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందన్నారు. కొతంమంది యూనియన్‌ నేతలు తమ స్వార్థం కోసం టీఎస్‌ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించింది. సమ్మె అన్నది కార్మికుల కోసం కాకుండా, యూనియన్‌ నేతలు తమ ఉనికి చాటుకునేందుకు చేస్తున్నారని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top