జెండాలో నుంచి గులాబీ రంగు మాయం..! | TSRTC Strike : Telangana Mazdoor Union Decided To Change Flag Color | Sakshi
Sakshi News home page

జెండాలో నుంచి గులాబీ రంగు మాయం..!

Oct 26 2019 9:07 PM | Updated on Oct 26 2019 9:15 PM

TSRTC Strike : Telangana Mazdoor Union Decided To Change Flag Color - Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ మరింత ఉధృతమవుతోంది. యాజమాన్యంతో శనివారం జరిగిన ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) కీలక నిర్ణయం తీసుకుంది. టీఎంయూ జెండా రంగు మార్చుకుంది. గులాబీ రంగులో ఉన్న జెండాలు తొలగించి.. తెల్లరంగు జెండాలు వాడాలని టీఎంయూ నిర్ణయించింది. తెల్లరంగు జెండాపై ధనస్సు గుర్తుతో టీఎంయూ జెండా కొత్త రూపు సంతరించుకుంది. రేపు కొత్త జెండాతో టీఎంయూ ఆవిర్భావ దినోత్సవం జరపుకోనుంది.
(చదవండి : ఆర్టీసీ చర్చలు : ‘మొబైల్‌ ఫోన్లు లాక్కున్నారు’)

(చదవండి : ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement