
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రేపు(మే7వ తేదీ, బుధవారం) ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఈ మేరకు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ.. తమ సమ్మెను వాయిదా వేసుకుంది.
సమ్మెను వాయిదా మాత్రమే వేస్తున్నాం -
సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్ లో సమ్మె చేయక తప్పదని హెచ్చరించింది. సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని, ఆర్టీసీ కార్మికులంతా సమన్వయంగా ఉండాలని, మరోసారి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలనిర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు.
‘రవాణా శాఖ మంత్రి తో చర్చలు జరిపాం..Rtc యూనియన్ ల పై ఆంక్షలను ఎట్టివేస్తామని హామీ ఇచ్చారు. Rtc లోఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం అన్నారు. ఉద్యోగం భద్రతపై సర్కులర్ విడుదల చేస్తామన్నారు. విద్యుత్ బస్సులు కేంద్రం నుంచి రాయితీ లో కొని rtc కీ ఇప్పిస్తామన్నారు. కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాటిపథకన చేస్తామన్నారు.. Rtc ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంలో సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం,మంత్రిమీద నమ్మకం తో సమ్మెని తాత్కాలిక వాయిదా వేసుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించకపొతే మళ్ళీ సమ్మెలోకి వెళ్తాం’ అని అన్నారు.
తమ హామీలపై స్పష్టత రాకపోతే తాము మే 6వ తేదీ అర్థరాత్రి నుంచే సమ్మెకు దిగుతామని గత నెల ఆరంభంలోనే ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ నేతలు ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు, అటు లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీస్ అందజేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. ఈరోజు(మే 6వ తేదీ, మంగళవారం) వారిని చర్చలకు పిలిచింది.
ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఏర్పాటు
ఒకవైపు ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిన సందర్బంలోనే తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ఓ కమిటీని సర్కార్ చేసింది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. అధికారుల కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ లు ఉన్నారు. ఉద్యోగులతో వారి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ఈ అధికారుల కమిటీ విధి.