ఆర్టీసీ సమ్మె : విధుల్లో చేరేందుకు మరొకరు సిద్ధం

TSRTC Strike : Kamareddy Depot Driver Return To Duty After KCR Deadline - Sakshi

సాక్షి, కామారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్‌తో మరో ఆర్టీసీ కార్మికుడు విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కామారెడ్డి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సయ్యద్‌ హైమద్‌ తిరిగి విధుల్లో చేరుతున్నట్టు డిపో మేనేజర్‌కు ఆదివారం మధ్యాహ్నం రిపోర్టు చేశారు. రెండు నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైమద్‌ మీడియా ఎదుట వాపోయారు.

ఎన్నికల ముందు సమ్మె చేస్తే లాభం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పండగల ముందు సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. విధుల్లో చేరేందుకు తనపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇదిలాఉండగా..హైమద్ నిర్ణయంతో పల్లెబాట కార్యక్రమాన్ని డిపో కార్మికులు రద్దు చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యులకు సర్ది చెప్పే యత్నం చేశారు. ఇక ఉప్పల్‌ డిపోలో అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న కేశవ కృష్ణ.. తిరిగి విధుల్లో చేరుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం డిపో మేనేజర్‌కు లేఖ అందజేశారు.
(చదవండి : కేసీఆర్‌ డెడ్‌లైన్‌.. విధుల్లో చేరిన ఉద్యోగి)

చేరండి.. పూర్తి భద్రత కల్పిస్తాం
సాక్షి, నారాయణపేట : సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు నిర్భయంగా విధుల్లో చేరొచ్చునని జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన చెప్పారు. విధుల్లో చేరాలనుకునే కార్మికులకు పోలీస్ శాఖ తరపున పూర్తి భద్రత కల్పిస్తామని ఆయన  ఒక ప్రకటనలో తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top