టీ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు | TS High Court Directs Govt To File Counter Over PIL On Sheep Distribution Scheme | Sakshi
Sakshi News home page

కౌంటర్‌ దాఖలు చేయండి: హైకోర్టు

Jul 19 2019 8:46 PM | Updated on Jul 19 2019 8:47 PM

TS High Court Directs Govt To File Counter Over PIL On Sheep Distribution Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గొర్రెల పంపిణీ పథకంపై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో కుంభకోణం జరిగిందంటూ వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ అనే స్వచ్ఛంద సంస్థ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ కేసులో తెలంగాణా ప్రభుత్వంతో పాటు సీబీఐని పిటిషనర్‌ ప్రతి వాదులుగా చేర్చారు. ఈ క్రమంలో శుక్రవారం పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement