‘సాగర్‌’ కింద రబీకి 25 టీఎంసీలివ్వండి | ts government letter to krishna board on water for rabi | Sakshi
Sakshi News home page

‘సాగర్‌’ కింద రబీకి 25 టీఎంసీలివ్వండి

Jan 24 2017 3:24 AM | Updated on Oct 19 2018 7:22 PM

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద వేసిన పంటలకు తక్షణమే 25 టీఎంసీల నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కృష్ణా బోర్డుకు విన్నవిం చింది.

కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ
సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద వేసిన పంటలకు తక్షణమే 25 టీఎంసీల నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కృష్ణా బోర్డుకు విన్నవిం చింది. ఈ మేరకు సోమవారం బోర్డుకు లేఖ రాసింది. పట్టిసీమ లెక్కలను పరిగణన లోకి తీసుకుంటే ఏపీ 271.4 టీఎంసీలు వాడాల్సి ఉన్నా.. 298.62 టీఎంసీలను వాడిందని పేర్కొంది.

తెలంగాణ 158.53 టీఎంసీలు వాడాల్సి ఉన్నా.. 131.34 టీఎంసీలే వాడిందని  తెలిపింది. పట్టిసీమను పక్కనపెట్టి చూసినా ఏపీ 240.8 టీఎం సీలకు 250.1 టీఎంసీలు వాడిందని తెలిపింది. తెలంగాణకు 140.6 టీఎంసీలు రావాల్సి ఉండగా.. 131.34 టీఎంసీలే వినియోగించు కుందని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement