తుపాను హెచ్చరికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా పడింది.
హైదరాబాద్ : తుపాను హెచ్చరికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా పడింది. ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, బహిరంగ సభలను 18, 19వ తేదీలకు వాయిదా వేసింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వాయిదా పడిన ప్లీనరీ ఈ నెల 18న ఎల్బీస్టేడియంలో , 19న పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభ జరగనుంది. తుపాన్ నేపథ్యంలో హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున ప్లీనరీ వాయిదా వేస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా దీపావళి తర్వాతే నిర్వహించనున్నట్లు సమాచారం.